రాష్ట్రంలో వంద విద్యాలయాలు స్థాపిస్తామన్న వేదాంత

రాష్ట్రంలో వంద విద్యాలయాలు స్థాపిస్తామన్న వేదాంత

19-04-2017

రాష్ట్రంలో వంద విద్యాలయాలు స్థాపిస్తామన్న వేదాంత

ఆంధ్రప్రదేశ్‌లో వంద విద్యాలయాలను నెలకొల్పనున్నట్టు వేదాంత రెసోర్సెస్ ప్రకటించింది. దావోస్‌ పర్యటనలో వున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసిన వేదాంత రెసోర్సెస్ చైర్మన్ అనిల్ అగర్వాల్ 'నంద్ ఘర్' పేరుతో ఈ సరికొత్త విద్యాలయాలను రాష్ట్రంలో ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇప్పటికే ఉత్తర భారతంలో విద్యాలయాలను నిర్వహిస్తున్నామని అన్నారు. కార్పొరేట్ సామజిక బాధ్యత కింద నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమాలను అనిల్ అగర్వాల్ ముఖ్యమంత్రికి వివరించారు. పాఠశాలలు, అంగన్ వాడీ కేంద్రాలను బలోపేతం చేస్తున్నామని అన్నారు. ఖనిజ వనరులను వెలికితీసి వాటి ద్వారా ఆంధ్రప్రదేశ్‌ను ముఖ్య పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దాలన్నదే తన ప్రయత్నమని ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సందర్భంగా అన్నారు. పారిశ్రామికీకరణతో యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నదే తన ఆలోచనగా చెప్పారు. పారిశ్రామికీకరణను ప్రోత్సహించడం ద్వారా ఏపీలో నిర్మాణాత్మక మార్పులు సాధించవచ్చని అనిల్ అగర్వాల్ అభిప్రాయపడ్డారు.