రాష్ట్రాభివృద్ధికి కలిసి రావాలని సీఐఐ, సీఈవోలకు పిలుపు
Telangana Tourism
Vasavi Group

రాష్ట్రాభివృద్ధికి కలిసి రావాలని సీఐఐ, సీఈవోలకు పిలుపు

19-04-2017

రాష్ట్రాభివృద్ధికి కలిసి రావాలని సీఐఐ, సీఈవోలకు పిలుపు

ఆంధ్రప్రదేశ్‌లో సంపద సృష్టి, ఉద్యోగాల కల్పన కోసం, పెట్టుబడులను ఆకర్షించడానికి తన దావోస్ పర్యటన దోహదపడుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. వందలమంది సీఈఓలను ఒకేసారి కలిసే అవకాశం వున్నందునే దావోస్‌కు క్రమంతప్పకుండా వస్తున్నట్టు చెప్పారు. ఇంతమందిని సాధారణంగా కలవాలంటే చాలా సమయం పడుతుందన్నారు. దావోస్ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి సీఐఐ సీఈవో రౌండ్ టేబుల్ సమావేశంలో ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించారు. 
ముఖ్యమంత్రి ప్రసంగం సారాంశం :
*  ఒకేసారి ఒకే వేదికపై ఇంత మంది పారిశ్రామిక, వాణిజ్య ప్రముఖులను, మేధావులను కలుసుకోవడం, వీరందరితో రాష్ట్రాభివృద్ధి కోసం చర్చించడం ఈ సదస్సు ద్వారా సాధ్యమైంది. 
*  గతంలో నాకు సైబరాబాద్ నిర్మించిన అనుభవం ఉంది. ఇప్పుడు కొత్త రాష్ట్రంలో కొత్త రాజధానిని నిర్మించే గొప్ప అవకాశం వచ్చింది. 
*  ఆంధ్రప్రదేశ్‌కు అనేక సానుకూలాంశాలు ఉన్నాయి. సుదీర్ఘ కోస్తా తీరం, సహజ వనరులు రాష్ట్రం సొంతం. 
*  ఒక విజన్‌తో పనిచేస్తున్నాం. 2022 నాటికి దేశంలోని మూడు అగ్రగామి రాష్ట్రాల్లో ఒకటిగా, 2029 నాటికి దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా, 2050 నాటికి
*  అత్యున్నత ప్రమాణాలు గల ప్రపంచ గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్‌ను మలచాలన్నదే మా సంకల్పం. 

* సంతోషం, సంపద కలిగిన రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టి, మా వృద్ధిలో భాగస్వాములు కండి. మాది కొత్త రాష్ట్రం, యంగ్ స్టేట్, రాష్ట్రాభివృద్ధి అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నాం. 

* గత ఏడాది మా వృద్ధి రేటు 10.99% గా ఉంది. సరళీకృత వ్యాపారంలో దేశంలో మొదటి స్థానంలో వున్నాం. మీ సూచనలు, సలహాలు మాకు అవసరం. ఎంటర్ప్రెన్యూర్ షిప్‌పై ఒక సంస్థను ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. 

* మా నూతన రాజధాని నిర్మాణంలో మీరంతా భాగస్వాములు కావాలని ఆశిస్తున్నాను. పెట్టుబడులు పెట్టడమే కాకుండా మంచి ఆలోచనలు మాకు అందించండి. అమరావతి భారతదేశానికి కాకుండా ప్రపంచ నగరంగా ఉండాలన్నదే నా ప్రయత్నం రాష్ట్రంలో తీసుకొచ్చిన సీఎం కోర్ డాష్ బోర్డ్‌ను రౌండ్ టేబుల్ సమావేశం చివరలో ముఖ్యమంత్రి స్వయంగా అందరికీ పరిచయం చేశారు. దీనిపై ప్రశంసలు జల్లు కురిసింది. ఈ రౌండ్ టేబుల్ వేదికపై సీఐఐ సీఈఓ చంద్రజిత్ బెనర్జీ, ప్రెసిడెంట్ నౌషాద్ ఫోర్సెస్ తదితరులు వున్నారు.


Click here for Photogallery