హిందూ కాంగ్రెస్ చైర్మన్ గా శ్రీప్రకాశ్

హిందూ కాంగ్రెస్ చైర్మన్ గా శ్రీప్రకాశ్

15-06-2018

హిందూ కాంగ్రెస్ చైర్మన్ గా శ్రీప్రకాశ్

చికాగోలో సెప్టెంబర్‌ 7 నుంచి మూడురోజుల పాటు ప్రపంచ హిందూ కాంగ్రెస్‌(డబ్ల్యూహెచ్‌సీ) సదస్సును నిర్వహించనున్నారు. ఈ సదస్సుకు ప్రఖ్యాత మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఎంఐటీ)కి చెందిన ప్రొఫెసర్‌ డా.శ్రీప్రకాశ్‌ కొఠారి చైర్మన్‌గా వ్యవహరిస్తున్నట్లు సదస్సు నిర్వాహకులు తెలిపారు. ప్రతి నాలుగేళ్లకు ఓసారి జరిగే ఈ కార్యక్రమంలో టిబెటిన్ల ఆధ్యాత్మిక గురువు దలైలామా, ఆరెస్సెస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ సహా 80 దేశాల నుంచి 2,000 మంది ప్రతినిధులు పాల్గొననున్నట్లు వెల్లడించారు. స్వామి వివేకానంద చికాగోలో 1893, సెప్టెంబర్‌ 11న చారిత్రక ప్రసంగం చేసి 125 ఏళ్లు పూర్తికానున్న సందర్భంగా ఈ సదస్సును ఇక్కడ ఏర్పాటు చేశారు.