జనరల్ మోటార్స్ సిఎఫ్ఓగా దివ్య
Sailaja Reddy Alluddu

జనరల్ మోటార్స్ సిఎఫ్ఓగా దివ్య

15-06-2018

జనరల్ మోటార్స్ సిఎఫ్ఓగా దివ్య

విదేశాల్లో మనవాళ్ళ హవా కొనసాగుతోంది. అమెరికాలో పలు దిగ్గజ కంపెనీల్లో కీలకమైన బాధ్యతలను మనవాళ్ళు చేపట్టారు. తాజాగా భారత సంతతికి చెందిన మహిళ ప్రపంచ ఆటో దిగ్గజ కంపెనీలో కీలక అధికారిగా ఎంపికయ్యారు. చెన్నైలో జన్మించిన దివ్య సూర్యదేవర (39) అతిపెద్ద వాహన సంస్థ జనరల్‌ మోటార్స్‌ కు సీఎఫ్‌వోగా నియమితులయ్యారు. చక్‌ స్టీవెన్స్‌ స్థానంలో దివ్య ఈ పదవికి ఎంపికయ్యారు. సెప్టెంబర్‌ నుంచి దివ్య సీఎఫ్‌వోగా పదవీ బాధ్యతలను స్వీకరించనున్నారని జనరల్స్‌ మోటార్స్‌ వెల్లడించింది.

దివ్య అనుభవం, నాయకత్వం కారణంగా ఆర్ధిక కార్యకలాపాల్లో అంతటా దఢమైన వ్యాపారాన్ని నిర్మించుకున్నామని బార్రా ఒక ప్రకటనలో తెలిపారు.

మద్రాసు యూనివర్శిటీ నుంచి కామర్స్‌లో మాస్టర్స్‌ పట్టా పొందిన దివ్య , అమెరికా హార్వర్డ్‌ యూనివర్శిటీ ద్వారా ఎంబీఏ సాధించారు. అనంతరం ఛార్టర్డ్‌ ఫైనాన్షియల్‌ ఎనలిస్ట్‌ (సీఎఫ్‌ఏ) ధ వీకరణ పొందారు. 2005లో జనరల్‌ మెటార్స్‌ కంపెనీలో చేరిన తరువాత దివ్య జూలై , 2017 నుంచి కార్పొరేట్‌ ఫైనాన్స్‌కు వైస్‌ ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తున్నారు.