ఉల్లాసంగా ఉత్సాహంగా సాగిన బాటా ఉగాది వేడుకలు

ఉల్లాసంగా ఉత్సాహంగా సాగిన బాటా ఉగాది వేడుకలు

09-04-2019

ఉల్లాసంగా ఉత్సాహంగా సాగిన బాటా ఉగాది వేడుకలు

బే ఏరియా తెలుగు అసోసియేషన్‌ (బాటా) ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా నిర్వహించే ఉగాది సంబరాలు ఏప్రిల్‌ 6వ తేదీన మిల్‌పిటాస్‌లోని ఇండియన్‌ కమ్యూనిటీ సెంటర్‌లో ఘనంగా జరిగాయి. దాదాపు 2000 మందికిపైగా అతిధులు ఈ వేడుకల్లో పాల్గొని రోజంతా ఉల్లాసంగా గడిపారు. ఉదయం 10 గంటలకు వేడుకలు ప్రారంభమయ్యాయి. యూత్‌ టాలెంట్‌ షో నిర్వహించారు. డ్యాన్సింగ్‌, సింగింగ్‌, స్పెషల్‌ టాలెంట్‌ పోటీలు జరిగాయి. తరువాత 11 గంటలకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), బాటా కలిసి ధీమ్‌ తానా పోటీలను నిర్వహించాయి.

ఈ ఉగాది వేడుకలకు బిజినెస్‌ కమ్యూనిటీ నుంచి మంచి ఆదరణ లభించింది. సంజయ్‌ ట్యాక్స్‌ సమర్పించిన ఈ వేడుకలకు యు స్మైల్‌ డెంటల్‌, పిఎన్‌జి జ్యూవెల్లర్స్‌ ప్రధాన స్పాన్సర్‌లుగా నిలిచాయి. గోల్డ్‌ స్పాన్సర్‌గా అపెక్స్‌ కన్సల్టింగ్‌, విజిటర్స్‌ గురు, అర్బన్‌ స్పైస్‌ (ఫుడ్‌ స్పాన్సర్‌), ఇతర స్పాన్సర్లుగా కాల్‌ హోమ్స్‌-రమణా రెడ్డి, పాఠశాల, సయ్యద్‌ అహ్మద్‌ (రియల్టర్‌), న్యూయార్క్‌ లైఫ్‌, అకాడమీ ఆఫ్‌ ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌ (ఎఓపిఎస్‌), మీడియా స్పాన్సర్లుగా  విరిజల్లు రేడియో, బాలీ 92.3 ఎఫ్‌ఎం, యో ఇండియా వ్యవహరించాయి. వేడుకలను పురస్కరించుకుని పలు వ్యాపార వాణిజ్యసంస్థలు తమ ఉత్పత్తులను వేడుకల ఆవరణలో ప్రదర్శించాయి. జ్యువెల్లరి, దుస్తులు, రియల్‌ ఎస్టేట్‌, ఫైనాన్షియల్‌ అండ్‌ ట్యాక్స్‌ సర్వీసెస్‌, ఫుడ్‌ సంస్థలవారు తమ ఉత్పత్తులను ప్రదర్శించారు.

ఈసారి జరిగిన పోటీలకు మంచి స్పందన వచ్చింది. శాస్త్రీయ సంగీతం, సినిమా పాటల సింగింగ్‌, డ్యాన్సింగ్‌, స్పెషల్‌ టాలెంట్‌ పోటీల్లో దాదాపు 300 మందికిపైగా చిన్నారులు పాల్గొన్నారు. సుమంత్‌, కొండల్‌, అరుణ్‌ ఈ పోటీలకు కావాల్సిన ఏర్పాట్లు చూశారు.

సాయంత్రం ఐదుగంటలకు ప్రధాన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. బాటా సలహాదారు విజయ ఆసూరి అందరికీ ఉగాది శుభాకాంలతో స్వాగతం పలికారు. జిల్‌ జిల్‌ ప్రపంచం పేరుతో ప్రదర్శంచిన కార్యక్రమంలో దాదాపు 100 మందికిపైగా చిన్నారులు పాల్గొన్నారు. బాటా కల్చరల్‌ టీమ్‌ ఈ చిన్నారులకు అవసరమైన తర్ఫీదును ఇచ్చింది. శ్రీలు, శిరీష, దీప్తి కొరియోగ్రఫీ అందించారు. తరువాత రంజనీ మంద (ఏరో డ్యాన్స్‌ గ్రూపు) విద్యార్థులు తమ ప్రదర్శనలిచ్చారు. నాకేంటి పేరుతో ప్రదర్శించిన హాస్యనాటిక అందరినీ నవ్వించింది. కళ్యాణ్‌ కట్టమూరి రాసి దర్శకత్వం వహించిన నాటిక ఇది. ఎన్నారై సిన్మా - ఛాప్టర్‌ 1 పేరుతో దృశ్య శ్రవణ రూపకం అందరినీ ఆకట్టుకుంది. ఎంతో ఆశతో అమెరికాకు వచ్చిన ఎన్నారైలు తమ దైనందిన జీవితంలో ఎదుర్కొంటున్న పరిస్థితులను కళ్ళకు అద్దేలా ఇందులో చూపించారు. సంకేత్‌, ఆదిత్య, సింధు, ఉదయ్‌ డ్యాన్స్‌లకు కొరియోగ్రఫీ అందించారు.

స్థానిక చిన్నారులకు తెలుగు భాషను నేర్పించడానికి బాటా-తెలుగు టైమ్స్‌ ఆధ్వర్యంలో పాఠశాలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. బాటా ప్రతి వేడుకల్లో పాఠశాల విద్యార్థులు తమ తెలుగు భాషా ప్రతిభను చాటుతూ వస్తున్నారు. ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్‌ రమేష్‌ కొండా పాఠశాల టీమ్‌ను అందరికీ పరిచయం చేశారు. ఈ వేడుకల్లోనే బాటా ప్రతి సంవత్సరం ప్రచురించే 'తెలుగు వెలుగు' మ్యాగజైన్‌ను కూడా ఆవిష్కరించారు. ఈ మ్యాగజైన్‌కు ఆర్టికల్స్‌ను, కవితలను, యాడ్స్‌ను ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు చెప్పారు.

ప్రముఖ గాయని సునీత సంగీత విభావరి వచ్చినవారందరినీ ఎంతగానో మైమరపింపజేసింది. ఆమెతోపాటు గాయని గాయకులు భార్గవి పిళ్ళై, దింకర్‌, కాప్రికో తెలుగు బ్యాండ్‌ సభ్యులు సూపర్‌ డూపర్‌ తెలుగు పాటలను పాడి అందరినీ పరవశింపజేశారు. వీరు, కరుణ్‌ ఈ సంగీత విభావరికి కావాల్సిన ఆడియోసరంజామాను ఏర్పాటు చేసి పర్యవేక్షించారు.

బాటా ప్రెసిడెంట్‌ యశ్వంత్‌ కుదరవల్లి వేడుకలను విజయవంతం చేసిన అందరికీ ధన్యవాదాలు చెప్పారు. తానా నాయకులు సతీష్‌ వేమూరి, రజనీకాంత్‌ కాకర్ల మాట్లాడుతూ వాషింగ్టన్‌ డీసిలో జరిగే తానా కాన్ఫరెన్స్‌కు అందరూ రావాలని సభాముఖంగా ఆహ్వానించారు.

బాటా ఎగ్జిక్యూటివ్‌ కమిటీని యశ్వంత్‌ కుదరవల్లి అందరికీ పరిచయం?చేశారు. హరనాథ్‌ చికోటి (వైస్‌ ప్రెసిడెంట్‌), సుమంత్‌ పుసులూరి (సెక్రటరీ), కొండల్‌రావు (ట్రెజరర్‌), అరుణ్‌ రెడ్డి (జాయింట్‌ సెక్రటరీ), స్టీరింగ్‌ కమిటీ సభ్యులు రవి తిరువీధుల, కామేష్‌ మల్లా, కళ్యాణ్‌ కట్టమూరి, శిరీష బత్తుల, కల్చరల్‌ డైరెక్టర్‌లు శ్రీదేవి పసుపులేటి, శ్రీలు వెలిగేటి, తారక దీప్తి, నామినేటెడ్‌ కమిటీ సభ్యులు వరుణ్‌ ముక్కా, హరి సన్నిధిని పరిచయం చేశారు.

 ఈ వేడుకను విజయవంతంగా నిర్వహించినందుకు బాటా టీమ్‌ను బాటా అడ్వయిజరీ బోర్డ్‌ సభ్యులు జయరామ్‌ కోమటి, విజయ ఆసూరి, వీరు ఉప్పల, ప్రసాద్‌ మంగిన, కరుణ్‌ వెలిగేటి, రమేష్‌ కొండ అభినందించారు.

Click here for Photogallery