రాష్ట్రంలో భారీగా ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమలు

రాష్ట్రంలో భారీగా ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమలు

10-06-2019

రాష్ట్రంలో భారీగా ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమలు

తెలంగాణలో పెద్దసంఖ్యలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమలు ఏర్పాటుకు అవకాశాలు పెరిగాయి. ఆయా జిల్లాల్లో పేరుగాంచిన పంటల ఆధారంగా పరిశ్రమల ఏర్పాటుకు వ్యవసాయ, ఉద్యాన, గ్రామీణాభివద్ధి శాఖలు కసరత్తును చేస్తున్నాయి. ఏయే జిల్లాల్లో ఏయే పంటలు అధికంగా సాగవుతాయి.. అక్కడ ప్రాసెసింగ్‌ యూనిట్లతో ఎన్ని రకాల ఉత్పత్తులు తయారు చేయవచ్చు అనే దానిపై డిఆర్‌డిఒలు రిపోర్ట్‌ తయారు చేశారు. దీనికి సంబంధించి నివేదికను రూపొందించారు. త్వరలోనే ప్రభుత్వానికి సమర్పించనున్నారు. ఇందులో ఆరు జిల్లాల్లో మిర్చి, ఏడు జిల్లాల్లో పప్పులు, 10 జిల్లాల్లో మామిడి, చిరుధాన్యాలకు మూడు జిల్లాల్లో, మొక్కజొన్నకు 5 జిల్లాల్లో, పసుపుకు 4 జిల్లాల్లో, కూరగాయలకు 6 జిల్లాల్లో, సోయాబీన్‌కు 2 జిల్లాల్లో, వరికి 04 జిల్లాల్లో, వేరుశనగకు మూడు జిల్లాల్లో ప్రతిపాదనలు చేసినట్లు తెలిసింది. రైతు పండించిన పంట దగ్గర నుంచి వినియోగదారుడి వద్దకు వెళ్లే వరకు పూర్తి సమాచారం ఉండేలా మూడు కేటగిరిల్లో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇందులో ఆయా జిల్లాల్లో స్థానిక 5 ప్రధాన వ్యవసాయ, ఉద్యాన పంటలు, ఇతర అనుబంధ రంగాల వివరాలు, ప్రాజెక్టులు, ఇప్పటికే ఉన్న ప్రాసెసింగ్‌ పరిశ్రమలు ఎన్ని వాటి వివరాలు, దగ్గరలోని వ్యవసాయ మార్కెట్‌లు, ఏమైనా కంపెనీలు కాంట్రాక్టు వ్యవసాయం చేస్తున్నాయా వివరాలు ఉన్నాయి. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలతలు, ప్రతికూలతలను తయారు చేశారు.  ఇప్పటికే మొత్తం 54 అంశాలపై అధ్యయనం చేశారు. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమల ఏర్పాటులో మహిళ స్వయం సహాయక సంఘాలకు పెద్దపీఠ వేయాలని సిఎం కెసిఆర్‌ ఆదేశించిన విషయం తెలిసిందే. ఇందుకోసం ముందుకు వచ్చే ఔత్సాహికులకు ఒక్కో పరిశ్రమకు రూ.5 కోట్ల వరకు స్త్రీనిధి బ్యాంకు ద్వారా రుణం ఇప్పించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోం ది. అందుకు స్త్రీ నిధి బ్యాంకు సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది. రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక సంఘాలు (ఎస్‌హెచ్‌జిలు) ఇప్పటికే రైతు సంఘాలను ఏర్పాటు చేసి ధాన్యం వంటి వ్యవసాయ దిగుబడుల కొనుగోళ్లను చేపడుతున్నాయి. గ్రామీణాభివ ద్ధి శాఖకు చెందిన పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్‌) నేత త్వంలో ఎస్‌హెచ్‌జిలు ఉన్నా యి. దీంతో ఈ సంస్థ ద్వారానే రాష్ట్రవ్యాప్తంగా ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమల ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. పరిశ్రమలకు వ్యవసాయ దిగుబడులను సరఫరా చేసేందుకు సెర్ప్‌.. రైతులతో సంఘాలను ఏర్పాటు చేయిస్తుంది. వ్యక్తులు, ఎస్‌హెచ్‌జిలు, ప్రైవేటు కంపెనీలు ఇలాంటి పరిశ్రమలను ఏర్పాటు చేయొచ్చు. వ్యవసాయ, ఉద్యాన శాఖలతో పాటు గ్రామీణాభివ ద్ధి శాఖ ఇప్పటికే జిల్లాలవారీగా లాభసాటి పంటలను అంచనావేసిఆయాచోట్ల ఎలాం టి పరిశ్రమలు అనుకూలమనేది ప్రతిపాదనలు చేశాయి. వాటిపై వ్యవసాయ, సెర్ప్‌ అధికారులు తాజాగా చర్చించి మరో 54 అంశాలపై అధ్యయనం చేశారు.  ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమ ఏర్పాటుతో అటు రైతుల కష్టాలు, నిరుద్యోగుల ఉపాధి కష్టాలు తీరనున్నాయి.