శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగాల కల్పనకు జగన్ శ్రీకారం

శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగాల కల్పనకు జగన్ శ్రీకారం

16-08-2019

శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగాల కల్పనకు జగన్ శ్రీకారం

ఆంధ్రప్రదేశ్‌లో యువతకు ఉద్యోగవకాశాల కల్పనలో భాగంగా ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేస్తూ, ఎప్పుడు ఏ రాష్ట్రం భర్తీ చేయనివిధంగా సుమారు లక్షగా పైగా ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ ఇచ్చేలా ఆదేశాలు జారీ చేశారు. నిజానికి ఇంతకు ముందు ఏపీలో ఏ ప్రభుత్వం వచ్చిన ఇంత పెద్ద స్థాయిలో ఉద్యోగాలను భర్తీ చేయలేదు. కాగా ఈ గ్రామ సచివాలయ ఉద్యోగ నియామకాల్లో పార్టీ నాయకులకు కార్యకర్తలకు ప్రాధాన్యం ఇవ్వకుండా అందరికీ లభించేలా చూడాలని కూడా జగన్‌ అధికారులను కోరారు. 

ఈ ఉద్యోగాలను కాంట్రాక్టు పద్దతిలో ఇవ్వకుండా పర్మినెంట్‌ పద్దతిలో భర్తీ చేయాలని కోరారు. ఈ ఉద్యోగాలను పారదర్శకంగా ఆన్‌ లైన్‌ పద్దతిలోనే భర్తీ చేస్తున్నారు. ఇందులో ఇంకొక విషయం ఏంటంటే, కేంద్రం ప్రతి ఏటా పంచాయతీలకు వేల కోట్లు నిధులు మంజూరు చేస్తుంటుంది. కానీ పాలకులు మాత్రం ఆ డబ్బులను మొత్తం పంచాయతీలకు ఖర్చు చేయకుండా ఆపేస్తున్నారు. ఉదాహరణకు కేంద్రం వంద రూపాయలు ఇస్తే కేవలం 10 రూపాయలు మాత్రమే పంచాయతీలకు విదిల్చేవారు. కానీ ఇప్పుడు కేంద్రం ఒక చట్టం తీసుకురావటానికి సిద్ధం అయ్యింది. ఈ చట్టం ప్రకారం పంచాయతీలకు నేరుగా నిధులు మంజూరు చేసే విధంగా ప్రణాళికలు రచిస్తుంది. కాబట్టి జగన్‌ అమలు చేస్తున్న గ్రామ పంచాయతీ వ్యవస్థ ఈ నిధులను సమర్ధవంతంగా వినియోగించుకుంటూ మంచి పరిపాలనను గ్రామ స్థాయిలో అందిస్తుందని జగన్‌ భావించి, అందులో భాగంగానే ఈ?గ్రామ సచివాలయ పోస్టులను ప్రవేశపెట్టారని చెబుతున్నారు.