బే ఏరియాలో బాబు యాత్ర సక్సెస్‌ మీట్‌
Ramakrishna

బే ఏరియాలో బాబు యాత్ర సక్సెస్‌ మీట్‌

22-05-2017

బే ఏరియాలో బాబు యాత్ర సక్సెస్‌ మీట్‌

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల అమెరికాలో జరిపిన పర్యటన విజయవంతం కావడంతో ఎన్నారై టీడిపి బే ఏరియా పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి బే ఏరియాలో 7 రోజులపాటు ఉండటంతోపాటు ప్రతి కార్యకర్తను పలకరించి, ఎన్నారైటీడిపితో, ఎపి జన్మభూమి కో ఆర్డినేటర్లతో గడిపిన క్షణాలను ఈ విజయోత్సవంలో మరోసారి స్మరించుకున్నారు.

మిల్‌పిటాస్‌లోని స్వాగత్‌ హోటల్‌లో జరిగిన ఈ వేడుకల్లో ఎన్నారై టీడిపి బే ఏరియాకు చెందిన వందలాదిమంది కార్యకర్తలు పాల్గొన్నారు. వెంకట్‌ కోగంటి తొలుత అందరికీ స్వాగతం పలుకుతూ ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ స్వయంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు చెప్పారు.

వేడుకల్లో భాగంగా ఎన్నారై టీడిపి విభాగం ఏర్పాటు చేసిన కేక్‌ను ఎపి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జయరామ్‌ కోమటి కట్‌ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నారై టీడిపి చేస్తున్న కార్యక్రమాలతో బలంగా తయారైందని, ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనను అందరూ మెచ్చేలా విజయవంతం చేయడమే ఇందుకు నిదర్శనమని చెప్పారు. ముఖ్యమంత్రి అమెరికా పర్యటనకు ముందు వేసుకున్న ప్రణాళిక ప్రకారం కార్యక్రమాలు సాఫీగా జరగడంతో ముఖ్యమంత్రి సంతోషం వ్యక్తం చేశారని చెప్పారు. ఈ పర్యటనను విజయవంతం చేసినవారందరికీ స్వయంగా అభినందనలు తెలుపుతున్నట్లు చెప్పారు.

ఈ కార్యక్రమంలో సతీష్‌ వేమూరి, శ్రీకాంత్‌ దొడ్డపనేని, రామ్‌ తోట, ప్రసాద్‌ మంగిన, హరి నల్లమల, రజనీకాంత్‌ కాకర్ల, శ్రీనివాస్‌ వీరపనేని తదితరులు పాల్గొన్నారు.


Click here for Event Gallery