అమెరికాలోని తెలుగు చిన్నారులకు గత నాలుగు సంవత్సరాలుగా మాతృభాష తెలుగును నేర్పిస్తున్న 'పాఠశాల' వసంతోత్సవ వేడుకలు ఫిలడెల్ఫియాలో జూలై 15వ తేదీన ఘనంగా జరిగింది. కాలేజివిల్లేలోని కమ్యూనిటీ మ్యూజిక్ స్కూల్లో జరిగిన ఈ వేడుకలకు 300 మందికిపైగా ఆహ్వానితులు హాజరయ్యారు. ఈ సందర్భంగా 50 మంది చిన్నారులు సాంస్కృతిక ప్రదర్శనలిచ్చారు. టీచర్లు విద్యుల్లత వాసిరెడ్డి, సునీత, లక్ష్మీ అద్దంకి, పద్మ ఈ సాంస్కృతిక ప్రదర్శనలను లీడ్ చేశారు. పాఠశాల చిన్నారులు చేసిన శ్రీకృష్ణరాయబారం, తెలుగు కవులు, బాహుబలి నాటిక వంటి కార్యక్రమాలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి.
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఈ పాఠశాలను ప్రమోట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తానా అధ్యక్షులు సతీష్ వేమన, ట్రెజరర్ రవి పొట్లూరి సహకారంతో ఈ వేడుకలను విజయవంతంగా జరిపినట్లు పాఠశాల ఏరియా కో ఆర్డినేటర్ నాగరాజు నలజుల తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్సీ వైవిబి రాజేంద్ర ప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇతర దేశానికి వచ్చినా సొంత సంస్కృతిని మర్చిపోకుండా పిల్లలకు తెలుగు భాష నేర్పించడానికి పాఠశాల ప్రయత్నించడం గొప్ప విషయమని అన్నారు. తెలుగువారికి సొంత భాషపై ఉన్న మమకారానికి ఇది నిదర్శనమని ప్రశంసించారు. అమెరికాలోని మిగిలిన రాష్ట్రాల్లో కూడా పాఠశాల తరగతులు ఏర్పాటు చేసి తెలుగు భాషను చిన్నారులకు ఇతరులకు కూడా నేర్పించాలని కోరారు. రాజేంద్రప్రసాద్‌ను తానా ట్రస్టీ హరీష్ కోయ, సాంబయ్య ఘనంగా సన్మానించారు. తెలుగు ప్రముఖులు అక్కిరాజు శర్మ, మల్లిక్‌ను కూడా సత్కరించారు. అపర్ణ వాగ్వాల ఈ వేడుకకు యాంకర్‌గా వ్యవహరించారు. యువ గాయకులు బుధవరపు సిస్టర్స్ (భాస్కరి, సింధు) పాడిన పాటలు అందరినీ ఎంతగానో ఆనందింపజేశాయి.
ఈ వేడుకను విజయవంతం చేయడానికి ఎంతోమంది సహకరించారు. సరోజ సాగరం, సునీత, సరోజ పావులూరి, లక్ష్మీ అద్దంకి, విద్యుల్లత వాసిరెడ్డి, విజయ జరుగుల, స్వరూప కోటపాటి, ఇందు సందడి, సునీత నలజుల, రాధా దేవి, కృష్ణజ నందమూరి, విజయశ్రీ పరుచూరి, రూప కోగంటి, రాజేశ్వరి కంతేటి, పద్మ బోగడి వచ్చినవారికి పసందైన విందును తయారు చేసి అందించారు.
కనెక్టికట్ నుంచి రావు యలమంచిలి, శ్రీనివాస్ భర్తవరపుతోపాటు, సాంబయ్య, సాయి జరుగుల, సతీష్ తుమ్మల, సింహబలుడు, హనుమంతు, సుధాకర్, గోపీ కృష్ణ, రమ, కృష్ణ, సునీల్, పికె కంతేటి, చలం, మోహన్ తమ్మన్న, శ్రీకృష్ణరాజ్, సుధాకర్, హరి కృష్ణ, మహర్షి, శ్రీకాంత్ చేబ్రోలు, యాది, కోటి ఏలూరి వెంకట ఆదిత్య తదితరులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. డోనర్లుగా వ్యవహరించిన రవి పొట్లూరి, హరీష్ కోయ, రవి మందలపు, వేణు, లక్ష్మీ మోపర్తి, సతీష్ తుమ్మల తదితరులకు ప్రత్యేక ధన్యవాదాలను నిర్వాహకులు తెలియజేశారు.