కేసరపల్లిలో ఎన్నారైల డిజిటల్‌ తరగతులు
MarinaSkies
Kizen
APEDB

కేసరపల్లిలో ఎన్నారైల డిజిటల్‌ తరగతులు

07-03-2018

కేసరపల్లిలో ఎన్నారైల డిజిటల్‌ తరగతులు

 

కేసరపల్లి ఎంపీపీ ఆదర్శ పాఠశాలలో ఇన్నర్‌వీల్‌క్లబ్‌ ఆఫ్‌ విజయవాడ ఆధ్వర్యంలో ఎన్‌ఆర్‌ఐలు కాకర్ల కళారాణి, తలశిలకృష్ణకుమారి సౌజన్యంతో రూ.3 లక్షలతో డిజిటల్‌ తరగతి గది ఏర్పాటు చేయగా మంగళవారం ప్రారంభించారు. సభకు ఎంఈవో బిజి మార్గరెట్‌ అధ్యక్షత వహించారు. బసవరావు మాట్లాడుతూ విదేశాల్లో ఉన్నప్పటికీ పుట్టిన ఊరును, పాఠశాలలను గుర్తించుకుని సేవచేయడం అభినందనీయమన్నారు. దాత కళారాణి మాట్లాడుతూ పాఠశాలను భవిష్యత్‌లో ఇంకా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామన్నారు. క్లబ్‌ చైర్‌పర్సన్‌ శ్రీదేవి, వీరపనేని శశికళ మాట్లాడారు. తానా సభ్యులు సురేష్‌ పుట్టగుంట, మాజీ ఎమ్మెల్యే ఎం. బాల కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.