అమెరికాలో మళ్లీ పేలిన తూటా

అమెరికాలో మళ్లీ పేలిన తూటా

అమెరికాలో మరోసారి జాత్యహంకారం విషం కక్కింది. న్యూయార్క్‌లో బుఫల్‌ ప్రాంతంలోని నిత్యావసర సరుకుల దుకాణంలో శ్వేతజాతి యువకుడు జరిపిన కాల్పుల్లో పదిమంది ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మృతులు, క్షతగాత్రులంతా నల్లజాతీయులు. రక్షణ కవచాలు ధరించి, హెల్మెట్‌ పెట్టుకున్న సాయుధ యువకుడు  సూపర్‌ మార్కెట్‌  వద్దకు వచ్చీరావడంతోనే బయట ఉన్న నలుగురిపై కాల్పులు జరిపాడు.  తీవ్రంగా గాయపడిన వారు కుప్పకూలి పోయిన వెంటనే లోపలికి జొరబడి విచక్షనా రహితంగా కాల్పులు జరిపాడు. ఆ సమయంలో లోపలున్న సెక్యూరిటీ గార్డు నిందితుడిపై కాల్పలు జరిపినప్పటికీ ఫలితం లేకపోయింది. యువకుడి కాల్పల్లో అతడు కూడా ప్రాణాలు కోల్పోయాడు. మాజీ పోలీస్‌ అధికారి అయిన ఆ వృద్ధుడు స్టోర్‌లో భద్రత విధులు నిర్వహిస్తూ ప్రాణాలు కోల్పోయాడు.  పెద్ద ఎత్తున ఆయుధాలతో వచ్చిన ఆ యువకుడు కాల్పల ఉదంతాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసేలా ఏర్పాట్లు చేసుకుని రావడం గమనార్హం.

 

Tags :