కాలిఫోర్నియాలో ఘనంగా జరిగిన "వీక్షణం" సాహితీ వేదిక 10వ వార్షికోత్సవం

కాలిఫోర్నియాలో ఘనంగా జరిగిన "వీక్షణం" సాహితీ వేదిక 10వ వార్షికోత్సవం

సెప్టెంబరు 11, 2022 న ఉదయం 10 గం. నించి సాయంత్రం 5 గం. వరకు వీక్షణం దశమ వార్షికోత్సవాన్ని అమెరికాలోని కాలిఫోర్నియాలో మిల్పిటాస్ నగరంలోని స్వాగత్ హోటల్లో అట్టహాసంగా జరుపుకుంది. ఈ కార్యక్రమాన్ని వీక్షణం వ్యవస్థాపక అధ్యక్షులు, ప్రముఖ రచయిత్రి డా.కె.గీతామాధవి సభకు ఆహ్వానం పలికి ప్రారంభించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రఖ్యాత అవధాని శ్రీ మేడసాని మోహన్ విచ్చేసి, ప్రసంగించారు. ప్రముఖ రచయిత డా. అక్కిరాజు రమాపతిరావు గారు "వీక్షణం జీవన సాఫల్య పురస్కారాన్ని" శ్రీ మేడసాని మోహన్ గారు, శ్రీ కోమటి జయరాం గార్ల చేతులమీదుగా అందుకున్నారు. రోజంతా జరిగిన వీక్షణం వార్షికోత్సవంలో స్థానిక ప్రముఖ కవులు, రచయితలు శ్రీ శ్రీచరణ్ పాలడుగు, డా.వేమూరి వేంకటేశ్వర్రావు, శ్రీ సుభాష్ పెద్దు, శ్రీ వేణు ఆసూరి, శ్రీ మధు ప్రఖ్యా మున్నగువారు ఉపన్యసించారు.

ఈ సభలో అపరాజిత (గత ముప్పయ్యేళ్ల స్త్రీవాద కవిత్వం 1993-2022), అసింట (డా.కె.గీత కవిత్వం-పాటలు) పుస్తకావిష్కరణలు, వీక్షణం ప్రత్యేక సంచికల ఆవిష్కరణలు జరిగాయి. "కొత్తకథ దిశ- గమనం" అనే అంశంమీద  శ్రీ మృత్యుంజయుడు తాటిపాముల అధ్యక్షతన జరిగిన చర్చలో డా. ఏ.కే. ప్రభాకర్, డా.కే.వి.రమణారావు పాల్గొన్నారు. శ్రీ రావు తల్లాప్రగడ అధ్యక్షతని జరిగిన కవిసమ్మేళనంలో స్థానిక కవులు డా||కె.గీత, శ్రీమతి శారద కాశీవఝల, శ్రీమతి అపర్ణ గునుపూడి, శ్రీ శ్రీధర్ రెడ్డి, శ్రీ ప్రసాద్ వరకూరు, శ్రీ తాటిపర్తి బాలకృష్ణారెడ్డి, శ్రీమతి షంషాద్, శ్రీ శశి ఇంగువ,  శ్రీ దాలిరాజు, శ్రీ కృష్ణకుమార్ పిల్లలమఱ్ఱి,  శ్రీ వికాస్ విన్నకోట, శ్రీ శ్యామ్ సుందర్ పుల్లెల, శ్రీమతి సుమలత మాజేటి, శ్రీమల్లవరపు సాయికృష్ణ, శ్రీమతి ఆచంట స్వాతి మొ.న వారు కవితాగానం చేసారు. ప్రముఖ సాహితీవేత్త శ్రీ కిరణ్ ప్రభ "సాహితీ క్విజ్" ని నిర్వహించి, సమాపనోపన్యాసం చేసారు. 2012 నుంచి అమెరికాలోని కాలిఫోర్నియా, బే ఏరియా లో "వీక్షణం" సాహితీ వేదిక నెలనెలా సాహిత్య కార్యక్రమాలు జరుపుకుంటూ ప్రవాసాంధ్రుల తెలుగు భాషాభిమానాన్ని, సాహిత్యాభిలాషని చాటుతున్నది. 

 

Tags :