ఐఐటీ హైదరాబాద్ లో కరోనా కలకలం...

ఐఐటీ హైదరాబాద్ లో కరోనా కలకలం...

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. సంగారెడ్డి జిల్లాలోని కంది శివారులో ఉన్న ఐఐటీ హైదరాబాద్‌లో కరోనా కలకలం రేగింది. క్యాంపస్‌లో మొత్తం 119 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. వీరిలో విద్యార్థులు,  సిబ్బంది, పలువురు కార్మికులు ఉన్నారు. ఈ మేరకు యాజమాన్యం ప్రకటించింది. కరోనా సోకిన వారికి స్వల్ప లక్షణాలే ఉన్నట్లు తెలిపింది. వారందరినీ ఐఐటీ హైదరాబాద్‌ వసతి గృహంలోనే ప్రత్యేకంగా ఐసోలేషన్‌ ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నట్లు వెల్లడిరచింది. విద్యార్థులకు కరోనాతో మిగిలిన విద్యార్థులు, ప్రొఫెసర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 

Tags :