అమెరికాలో మంకీపాక్స్ కలకలం

అమెరికాలో మంకీపాక్స్  కలకలం

అమెరికాలో అత్యంత అరుదైన,  ప్రమాదకరమైన మంకీపాక్స్‌ కేసు వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే యూరప్‌ దేశాల్లో ఈ వైరస్‌ కేసులు కలకలం రేపుతున్నాయి. ఇటీవల కెనడా నుంచి అమెరికాకు తిరిగి వచ్చిన మసాచుసెట్స్‌కు చెందిన వ్యక్తికి మంకీపాక్స్‌ సోకిందని, ఆస్పత్రిలో అతనికి చికిత్స అందజేస్తున్నట్లు సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (సీడీసీ) వెల్లడించింది. ఈ వైరస్‌ వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకున్నామని ప్రస్తుతానికి ప్రజలకు వచ్చిన ముప్పేమీ లేదని స్పష్టం చేసింది. ఈ ఏడాది అమెరికాలో ఇదే తొలి కేసు. యూకే, పోర్చుగల్‌, స్పెయిన్‌, కెనడా దేశాల్లో ఇప్పటికే 10కి పైగా కేసులు నమోదై కలవర పెడుతున్నాయి.

 

Tags :