లాస్ ఏంజెలెస్ లో మరోసారి కాల్పుల కలకలం

లాస్ ఏంజెలెస్ లో మరోసారి కాల్పుల కలకలం

అమెరికాలో మరోసారి కాల్పుల ఘటన కలకలం రేపింది. గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు చనిపోగా ఐదుగురు గాయాలపాలయ్యారు. క్యాలిఫోర్నియా రాష్ట్రం లాస్‌ఏంజెలెస్‌లోని శాన్‌పెడ్రో ప్రాంతంలో పెక్‌ పార్క్‌ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కార్‌ షో జరుగుతున్న ప్రాంతంలో కాల్పులు చోటుచేసుకున్నాయని పోలీసులు  తెలిపారు. ఘటనకు కారణాలపై దర్యాప్తు చేపట్టారు. ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయలేదని తెలిపారు.

 

Tags :