మమ్మల్ని భారత్‌కు పంపండి : తెలుగు కార్మికలు

మమ్మల్ని భారత్‌కు పంపండి : తెలుగు కార్మికలు

బహ్రెయిన్‌కు వెళ్లిన తెలుగు కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమను తిరిగి స్వదేశం పంపాలంటూ వేడుకున్న వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. వారంతా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాలతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలను నుంచి బహ్రెయిన్‌ వలస వెళ్లారు. అక్కడి ఎన్‌ఎస్‌హెచ్‌ సంస్థలో ఆరు వేలమందికి పైగా పనిచేస్తున్నారు. వారు పనిచేస్తున్న కంపెనీ చుట్టూ గ్యాస్‌ కంపెనీలు ఉన్నాయి. అవి విడిచిపెట్టే విషవాయువులు పీల్చుతూ వీరంతా ఊపిరాడక ఇబ్బందులు పడుతున్నారు. వీరిలో కొందరు మరణించారు కూడా. తమకు భయంగా ఉందని, తాము ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి సంస్థ ప్రతినిధులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని వాపోయారు. అంతేకాక, తమను శారీరకంగానూ వేధింపులకు గురిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వీలైతే తమకు వేరేచోట పని ఇప్పించాలని, లేదంటే  భారత్‌కైనా తమను పంపించి వేయాలని వేడుకుంటున్నారు. తమ బాధలను భారత దౌత్య కార్యాలయం కూడా తమ గురించి పట్టించుకోవడం లేదని, ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు.

 

Tags :