MKOne TeluguTimes-Youtube-Channel

సొంత స్టేట్‌లోనే తగ్గిన మద్దతు.. ప్రెసిడెంట్‌గా కమల వద్దంటున్న ఓటర్లు!

సొంత స్టేట్‌లోనే తగ్గిన మద్దతు.. ప్రెసిడెంట్‌గా కమల వద్దంటున్న ఓటర్లు!

అగ్రరాజ్యం అమెరికా వైస్ ప్రెసిడెంట్‌‌గా సేవ చేస్తున్న కమలా హ్యారిస్‌ను చాలా సార్లు ఆ దేశాధ్యక్షుడు జో బైడెన్ పొరపాటున ప్రెసిడెంట్ అన్నాడు. ఆయనకు ఈ ఆలోచన అంత బాగా నచ్చినా కూడా ప్రజలకు మాత్రం ఈ విషయంపై అంత ఆసక్తి లేదని తెలుస్తోంది. ఈ క్రమంలోనే భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్‌పై ప్రజలకు నమ్మకం తగ్గిందా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఆమె సొంత స్టేట్ కాలిఫోర్నియాలోనే మొత్తం 7512 మంది ఓటర్లపై ఒక సర్వే చేశారు. వచ్చే ఏడాది జరిగే అధ్యక్ష ఎన్నికల్లో ప్రెసిడెంట్ పదవికి కమల పోటీ చేస్తే ఎలా ఉంటుంది? అని వారిని అడిగారు. వీరిలో 59 శాతం మంది కమల ఈ పదవికి పోటీ చేయడంపై అయిష్టత చూపారు. 18 శాతం మంది అంత గొప్ప ఆలోచన కాదన్నారు. 41 శాతం మంది అయితే అస్సలు వద్దంటే వద్దన్నారు. ఈ సర్వేలో పాల్గొన్న ఓటర్లలో 16 శాతం మంది కమలకు పూర్తి మద్దతివ్వగా.. 21శాతం మంది అప్పుడు చూద్దాం అనే తరహాలో మాట్లాడారట. కాలిఫోర్నియాలోని డెమొక్రాట్లలో 40 శాతం మందిపైగా కమలకు వ్యతిరేకంగా ఉండటం గమనార్హం. వచ్చే ఎన్నికల్లో కమల నిలబడితే అది పార్టీకి నష్టం కలిగిస్తుందని వారు భావిస్తున్నారట. అయితే వచ్చే ఎన్నికల్లో కూడా మళ్లీ బైడెన్ నిలబడతాడా? లేక కమలకు అవకాశం దక్కుతుందా? అనేది తెలియాలంటే వేచి చూడక తప్పదు.

 

 

Tags :