ముగ్గురు భారతీయులకు ప్రతిష్ఠాత్మక పురస్కారం

విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన ముగ్గురు భారతీయు శాంతి పరిరక్షకులకు ఐరాస పురస్కారం ప్రకటించింది. ఐరాస తరపున పోరాడుతూ ప్రాణాలు కోల్పోయిన మొత్తం 103 మంది సైనికులకు డగ్ హమర్‌స్కోల్డ్ పతకాలను ఐరాస ప్రధాన కార్యాలయంలో ప్రదానం చేయనున్నారు. వీరిలో బీఎస్‌ఎఫ్ హెడ్ కానిస్టేబుళ్లు శిశుపాల్‌సింగ్, సన్వాలా రామ్ విష్ణోయీ (వీరిద్దరూ కాంగోలో పనిచేశారు.), వృత్తి నిపుణుల హోదాలో పని చేసిన షాబెర్ తహెర్ ఆలీ ( ఇరాక్‌లో సేవలు) ఉన్నారు. ఐరాస తరపున శాంతి పరిరక్షక దళాల్లో పనిచేసేందుకు భారత్ 6,000 మందికి పైగా సైనిక, పోలీసు సిబ్బందిని వివిధ దేశాలకు పంపించింది.
Tags :