MKOne Telugu Times Business Excellence Awards

ప్రపంచంలో ఇదే తొలిసారి

ప్రపంచంలో ఇదే తొలిసారి

మూడు నెలల మగ శిశువుకు ఢిల్లీ ఎయిమ్స్‌ వైద్యులు ల్యాప్రోస్కోపిక్‌ సర్జరీతో రెండు మూత్రపిండాల్లో ఏర్పడిన అవరోధాలను తొలగించారు. ఇంత చిన్న వయసులో ఉన్న రోగికి ఈ తరహా  ప్రక్రియతో చికిత్స చేయడం ప్రపంచంలో ఇదే తొలిసారి అని ఎయిమ్స్‌ వర్గాలు పేర్కొన్నాయి. ఈ సర్జరీని గత ఏడాది డిసెంబరులో పీడియాక్రిట్‌ విభాగం నిర్వహించిందని, చిన్నారిని మూడు రోజుల్లోనే డిశ్చార్జ్‌ చేశామని  ఎయిమ్స్‌ తెలిపింది. మూడు నెలల తర్వాత రినోగ్రామ్‌ పరీక్షతో ఆపరేషన్‌ విజయవంతమైన విషయాన్ని ధ్రువీకరించుకున్నామని తెలిపింది. 

 

 

Tags :