రోప్ జంప్ లో కస్తూర్బా విద్యా సంస్థ బాలికలు ప్రపంచ రికార్డు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని కస్తూర్బా విద్యా సంస్థ బాలికలు అరుదైన రికార్డు సాధించారు. రోప్జంప్ 36 గంటలు ఆడి ప్రపంచ రికార్డు సృష్టించారు. ఈ పోటీలో ప్రతి నాలుగు గంటలకోసారి ఓ గంటపాటు విరామం ఉంటుంది. కర్ణాటక ర్ఱాష్టం హోస్పేటలో ఇటీవల జరిగిన 19వ జాతీయ ఛాంపియన్షిప్ పోటీల్లో ఈ ఘనత సాధించారు. డబుల్ డచ్‌లో మూడు బంగారు, ఆరు రజత పతకాలు సాధించి దేశంలో ఆరో ర్యాంక్‌లో నిలిచారు. పోటీల్లో తొమ్మిది, ఆరో తరగతి విద్యార్థినులు పాల్గొన్నారు. వీరిని జిల్లా ప్రాజెక్టు అధికారిని ఉషారాణి ప్రత్యేకంగా అభినందించారు.
Tags :