అమెరికాలో కాల్పులు...

అమెరికాలోని అలబామాలోని ఓ చర్చిలో ఓ వ్యక్తి జరిపిన కాల్పుల్లో ఇద్దరు మృతి చెందగా ఒకరు గాయపడ్డారు. వెస్టావియా హిల్స్ శివారు బర్మింగ్హాంలోని సెయింట్ స్టీఫెన్స్ ఎపిస్కోపల్ చర్చిలో కొద్ది మంది గుమికూడి ఉండగా ఘటన చోటుచేసుకుంది. అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతుల, క్షతగాత్రుల వివరాలను వెల్లడిరచలేదు. నెల క్రితం కాలిఫోర్నియాలోని ఓ చర్చిలోఒక వ్యక్తి జరిపిన కాల్పులో ఒకరు చనిపోగా, ఐదుగురు గాయపడ్డారు.
Tags :