జులై 1 నుంచి కొత్త రూల్స్.. వారానికి 4 రోజులే

జులై 1 నుంచి కొత్త రూల్స్.. వారానికి 4 రోజులే

కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన నాలుగు కార్మిక చట్టాలు జులై 1 నుంచి అమల్లోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే చాలా రాష్ట్రాలు ఈ చట్టాలకు సంబంధించి నిబంధనలను రూపొందించాయి. ఇప్పటికే కొన్ని నెలలుగా వాయిదా పడుతూ వస్తున్న ఈ చట్టాలు అమల్లోకి వస్తే ఉద్యోగుల వేతనం, పీఎఫ్‌ కాంట్రిబ్యూషన్‌, పని సమయం వీక్లీ ఆఫ్‌లు వంటి వాటిలో పలు మార్పు చోటు చేసుకోనున్నాయి. కొత్త చట్టాల ప్రకారం రోజువారీ పని సమయం 12 గంటలకు పెరగనుంది. అంటే ప్రస్తుతం ఉన్న 8 గంటలకు బదులు 12 గంటల పాటు పనిచేయాలని కంపనీ ఉద్యోగులను కోరవచ్చు. ఈ లెక్కన వారంలో మూడు వీక్లీ ఆఫ్‌లు వస్తాయి. అయితే వారానికి గరిష్ఠంగా 48 గంటలు మాత్రమే పనిచేయాల్సి ఉంటుందని చట్టం చెబుతోంది. ఒకవేళ సదరు కంపెనీ 8 గంటలు మాత్రమే పనిచేయించుకుంటే వారంలో ఒక వీక్లీ ఆఫ్‌ మాత్రమే వస్తుంది.

 

Tags :