ఇండియన్ బ్యాంక్ సంచలన నిర్ణయం.. 50శాతం తగ్గింపు

ఇండియన్ బ్యాంక్ సంచలన నిర్ణయం.. 50శాతం తగ్గింపు

తమ బ్యాంకు ద్వారా సినిమా టిక్కెట్లను బుక్‌ చేసుకున్నట్లయితే 50 శాతం తగ్గింపు ఇవ్వాలని దేశంలోని 7వ అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్‌ అయిన ఇండియన్‌ బ్యాంక్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ తగ్గింపు తమ బ్యాంకు నుండి తీసుకున్న క్రెడిట్‌ కార్డుపై సినిమా టిక్కెట్లను బుక్‌ చేసుకుంటే వర్తిస్తుందని తెలిపింది. కరోనా కారణంగా సినిమా హాళ్లు మూతపడ్డాయి. లాక్‌డౌన్‌ ఎత్తేసి ఇప్పుడిప్పుడే సినిమా హాళ్లకు అనుమతులు ఇస్తున్నాయి. ఈ సమయంలో కుంటుపడిన వ్యాపారాన్ని గాడిలో పెట్టేందుకు సినిమా హాళ్లు, బ్యాంకులు, బుకింగ్‌ యాప్‌లు వినియోగదారులను ఆకర్షించేందుకు రకరకాల ఆఫర్లను ఇస్తున్నాయి. ఇందులో భాగంగా ఇండియన్‌ బ్యాంక్‌ 50 శాతం తగ్గింపు నిర్ణయం తీసుకుంది. అయితే ప్రభుత్వం సినిమా హాళ్లకు అనుమతి ఇచ్చిందని కానీ కరోనా నిబంధనలు కచ్చితంగా పాలించాలని స్పష్టం చేసింది. ఇటువంటి సమయంలో ఇండియన్‌ బ్యాంక్‌ ఈ ఆఫర్‌ను ప్రకటించడం విశేషం.

 

Tags :