హలో హాంకాంగ్ పేరుతో ..5 లక్షల ఉచిత విమాన టికెట్లు

కొవిడ్‌తో దెబ్బతిన్న పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రపంచ పర్యాటకులకు హాంకాంగ్ భారీ ఆఫర్లు ప్రకటిస్తున్నది. ఇందులో భాగంగా 5 లక్షల ఉచిత విమాన టికెట్లు అందజేయాలని నిర్ణయించింది. హలో హాంకాంగ్ పేరుతో ఉచిత టికెట్లు, ఉచిత వోచర్లు, ప్రత్యేక ఆఫర్లను కూడా అందిస్తున్నది. లక్కీ డ్రాలు, ఒకటి కొంటే ఒకటి ఉచితం వంటి ఆఫర్లతో పర్యాటకులకు ఆకర్షిస్తున్నది. ఈ ఆఫర్లు మార్చి వరకు అందుబాటులో ఉంటాయని హాంకాంగ్ అధికారులు తెలిపారు.
Tags :