అన్నమయ్యపురంలో 520 అన్నమయ్య ఆరాధన

పద్మశ్రీ డా. శోభారాజు గారిచే స్థాపించబడిన అన్నమాచార్య భావనా వాహిని సంస్థ 39 సంవత్సరాలుగా అన్నమాచార్య సంకీర్తనల ప్రచారానికి కృషి చేస్తూనే వుంది. ప్రతి సంవత్సరం అన్నమాచార్య వర్ధంతి సందర్భంగా "అన్నమయ్య ఆరాధన" కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం 3రోజుల పాటు వైభవంగా జరుపనున్నారు. మొదటగా మార్చి 18 వ తేదీ ఉదయం 7 గంటలకు రామకృష్ణ మఠం నుండి టాంక్ బండ్ మీద ఉన్న అన్నమాార్యుల వారి విగ్రహం వరకు "మహానగర సంకీర్తన" నిర్వహిస్తారు.
శ్రీ సాందిప్ శ్రీ వేంకటేశ్వర స్వామి వేషధారణలో, చిరంజీవి అభిరామ్ అన్నమయ్య వేషధారణలో విద్యార్థులు, భక్తులందరితో అన్నమయ్య విగ్రహం వద్దకు చేరుకొని అక్కడ "అన్నమయ్య గోష్ఠిగానం" నిర్వహిస్తారు. ప్రముఖ కళాకారులు శ్రీ రామాచారి కొమండూరి, శ్రీ సాందిప్, శ్రీ సౌమ్య వారణాసి మరియు అన్నమాచార్య భావనా వాహిని విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.
ముఖ్య అతిథిగా తెలంగాణ ప్రభుత్వ సలహాదారు శ్రీ కె. వి. రమణాచారి ఐ.ఏ.ఎస్ గారు విచ్చేయుచున్నారు. తరవాత మార్చి 19 వ తేదీ సాయత్రం 6 గంటలకు "సంకీర్తనా భావ తుషారం" అనే ప్రత్యేక కార్యక్రమం ఉంటుంది. మార్చి 20వ తేదీన అన్నమాచార్య భావనా వాహిని విద్యార్థులతో "సంకీర్తనా సుమం" అనే కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే. కార్యక్రమం అనంతరం అందరికీ స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేస్తాము. ఈ మహత్తర కార్యక్రమ విషయాన్ని అందరికీ తెలియజేయాలని మీకు విన్నపము చేయుచున్నాము.
- పిఆర్వో
రమణ గోరింట్ల.