కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు.. అక్టోబర్ నాటికల్లా

కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు.. అక్టోబర్ నాటికల్లా

ఈ ఏడాది సెప్టెంబ్‌, అక్టోబర్‌ నాటికల్లా దేశీయంగా సొంత 5జీ టెలికం సాంకేతికత అందుబాటులోకి రాగలదని కేంద్ర కమ్యూనికేషన్స్‌ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ ధీమా వ్యక్తం చేశారు. టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్‌ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయం తెలిపారు. నాణ్యమైన సాంకేతికతను చౌకగా పొందేందుకు ఇతర దేశాలు కూడా ఈ టెక్నాలజీలను పరిశీలించాలని కార్యక్రమంలో పాల్గొన్న అంతర్జాతీయ ప్రతినిధులకు సూచించారు. ఆర్థిక వృద్ధిలో టెక్నాలజీ కీలకపాత్ర పోషిస్తున్న నేపథ్యంలో డిజిటల్‌ తారతమ్యాలను తొలగించడం మరింత కీలకంగా మారిందని వైష్ణవ్‌ తెలిపారు. సమ్మిళిత వృద్ధి కోసం ప్రభుత్వం అన్ని ప్రయత్నాలూ చేస్తోందని ఆయన వివరించారు. మారుమూల ప్రాంతాలకు కూడా కనెక్టివిటీ పెంచేందుకు చర్యలు తీసుకుంటోందని తెలిపారు.

 

Tags :