తెలుగు యాత్రికులకు శుభవార్త.. కాశీలో మరో అధునాతన

తెలుగు యాత్రికులకు శుభవార్త.. కాశీలో మరో అధునాతన

తెలుగు యాత్రికుల శుభవార్త. కాశీలో యాత్రికుల కోసం మరో అధునాతన భవనం అందుబాటులోకి వచ్చింది. కాశీ పాండే హవేలీలో అఖిల బ్రాహ్మణ కరివెన సత్రం నిర్మించిన నూతన భవనానికి గృహ ప్రవేశం జరిగింది. కార్తీక మాసంలో ఏకాదశి రోజున కాశీ క్షేత్రంలో ఈ కరివెన సత్రం లాంఛనంగా ప్రారంభమైంది. 34 నూతన గదులు, అధునాతన సౌకర్యాలతో కాశీకి వచ్చే యాత్రికుల కోసం ఈ కరివెన సత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే కాశీలో యాత్రికుల కోసం 4 చోట్ల కరివెన సత్రం ఆధ్వర్యంలో నిత్యాన్నదాన, వసతి సౌకర్యం సేవలను అందజేస్తున్నారు. రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో 5వ భవనాన్ని అఖిల బ్రాహ్మణ కరివెన సత్రం నిర్వాహకులు ప్రారంభించారు.

 

Tags :