శోభారాజు సారధ్యంలో అన్నమాచార్య జయంతి

శోభారాజు  సారధ్యంలో అన్నమాచార్య జయంతి

614 వ అన్నమాచార్యుల వారి జయంతి సందర్భంగా గత 39 ఏళ్ల గా ఏటా పద్మశ్రీ .డా .శోభారాజు గారి సారధ్యంలో శ్రీ అన్నమాచార్య జయంతి ఉత్సవాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు. అందులో భాగంగా చిక్కడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవాలయం నుంచి ట్యాంక్ బండ్ అన్నమయ్య విగ్రహం వరకు ఈ "మహా నగర సంకీర్తన" నిర్వహించటం జరిగింది. ఇందులో భాగంగా అన్నమయ్య సమేత శ్రీ వేంకటేశ్వర స్వామివారిని కన్నులపండుగగా ఊరేగించటం జరిగింది. శ్రీ వెంకటేశ్వర స్వామి వేషధారణలో శ్రీ కాంత్, అన్నమయ్య వేషధారణలో కిరీటి పాల్గొన్నారు.

అనంతరం ట్యాంక్ బండ్ అన్నమయ్య విగ్రహం వద్ద అన్నమయ్య సంకీర్తనా కార్యక్రమం నిర్వహించారు. ధర్మ పురి దేవస్థానం మరియు భారతీయం వ్యవస్థాపకులు, శ్రీ మతి సత్య వాణి గారు తమ దివ్య సందేశాన్ని అన్నమయ్య సంకీర్తనా ప్రచారం శోభా రాజు గారికి స్వామి ఇచ్చిన ఆదేశం చేతనే వారు తలపెట్టిన కార్యక్రమం ఇప్పటికీ ఒక్క మహ యజ్ఞంలా కొనసాగుతోందన్నారు.  

శ్రీ యల్. వి. సుబ్రహ్మణ్యం, ఐ. ఎ. యస్ (రిటైర్డ్) మాట్లాడుతూ "కర్తృత్వ భావన లేకుండా ఏ రంగంలో నైనా కృషి చేస్తే ఆ రంగంలో నైపుణ్యాన్ని సాధించవచ్చు" అని తెలిపారు.

ఇంకా ప్రఖ్యాత నేపథ్య గాయకులు శ్రీ కే. రామాచారి గారు, శ్రీమతి గీతా మాధురి గారు "అదివో అల్లదిహో" సంకీర్తన గురించి మాట్లాడుతూ ఆ సంకీర్తన తొలుత డా. శోభారాజు గారి ఆడియో ద్వారా విని ఆదర్శంగా తీసుకున్నామని తెలిపారు, కాగా అదే సంకీర్తనను శ్రీ కే. రామాచారి గారు ఆలపించగా, శ్రీమతి గీతా మాధురి "నారాయణతే నమో నమో" అంటూ, మరియు కుమారి రమ్యా బెహర "నగవులు హితమని నమ్మేదా" సంకీర్తనలతో ఆకట్టుకున్నారు. ఆద్యంతం శోభారాజు గారితో పాటు వారి శిష్య బృందం "అన్నమాచార్య భావనా వాహిని" విద్యార్థులు తమ తమ సంకీర్తనలతో ఉత్తేజపరిచారు.

కార్యక్రమానంతరం అతిథులుగా పాల్గొన్న వారిని, కళాకారులను డాక్టర్ శోభా రాజు గారు మరియు డాక్టర్ నంద కుమార్ గారు సత్కరించారు. హారతి ప్రసాద వితరణతో కార్యక్రమం దిగ్విజయంగా ముగిసింది.


Click here for Photogallery

 

Tags :