గ్రామీ అవార్డు విజేతలు వీరే... చరిత్ర సృష్టించిన బియాన్సె

గ్రామీ అవార్డు  విజేతలు వీరే... చరిత్ర సృష్టించిన బియాన్సె

ప్రఖ్యాత హాలీవుడ్‍ 63వ గ్రామీ అవార్డ్స్‌ ఫంక్షన్‍ మార్చి 14న లాస్‍ఎంజిల్స్ లో జరిగాయి. మ్యూజిక్‍ ఇండస్ట్రీలో జరిగే పాపులర్‍ అవార్డుల వేడుక గ్రామీ. ఈ వేడుకలతో అత్యధికంగా ట్రోఫీలను గెలుచుకున్న అమెరికన్‍ సింగర్‍, రైటర్‍ బియన్సె చరిత్ర సృష్టించింది. గ్రామీస్‍ చరిత్రలో అత్యధిక అవార్డులు పొందిన మహిళగా ఆమె రికార్డును సొంతం చేసుకుంది. తాజాగా 28వ అవార్డు గెలుచుకున్న బియాన్సె ఇప్పటి వరకూ సింగర్‍ అలీసన్‍ క్రాస్‍ పేరు మీద ఉన్న రికార్డును తిరగరాసింది. బెస్ట్ ఆర్‍ బీ పర్ఫార్మెన్స్ అవార్డు అందుకున్న సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇది తనకు దక్కిన అత్యున్నత గౌరవమని బియాన్సె చెప్పింది. అటు టేలర్‍ స్విఫ్ట్ కూడా గ్రామీ అవార్డుల్లో చరిత్ర సృష్టించింది. ఆల్బమ్‍ ఆఫ్‍ ద ఇయర్‍ అవార్డును మూడుసార్లు గెలుచుకున్న తొలి మహిళా ఆర్టిస్ట్గా టేలర్‍ స్విఫ్ట్ నిలిచింది. లాక్‍డౌన్‍లో ఆమె తీసుకొచ్చిన ఫాక్‍లోర్‍ ఆల్బమ్‍కుగాను ఈ అవార్డు దక్కింది. అంతకుముందు 2010లో ఫియర్‍లెస్‍ ఆల్బమ్‍కు, 2016లో 1989కు కూడా గ్రామీ అవార్డులను సొంతం చేసుకుంది. ఆమె కంటే ముందు ఆల్బమ్‍ ఆఫ్‍ ద ఇయర్‍ అవార్డును మూడుసార్లు గెలుచుకున్నది కేవలం ముగ్గురే వాళ్లంతా మేల్‍ ఆర్టిస్ట్లే.

ఈ ఏడాది విజేతలు వీరే :

ఆల్బమ్‍ ఆఫ్‍ ద ఇయర్‍: టేలర్‍ స్విప్ట్-ఫోక్‍లోర్‍, రికార్డ్ ఆఫ్‍ ద ఇయర్‍: బిల్లీ ఐలిష్‍-ఎవిరిథింగ్‍ ఐ వాంటెడ్‍, సాంగ్‍ ఆఫ్‍ ద ఇయర్‍: హెచ్‍.ఈ.ఆర్‍-ఐ కాంట్‍ బ్రీత్‍, బెస్ట్ న్యూ ఆర్టిస్ట్: మేగన్‍ థీ స్టాలియన్‍. ఉత్తమ నూతన ఆర్టిస్ట్: మేగాన్‍ దీ స్టాలియన్‍, ఉత్తమ పాప్‍ సోలో ప్రదర్శన : వాటర్‍మెలాన్‍ బై హ్యారీ స్టైల్స్, ఉత్తమ రాక్‍ సాంగ్‍: స్టే హై బై బ్రిటనీ హోవార్డ్, ఉత్తమ రాక్‍ ఆల్బమ్‍: ది న్యూ ఆబ్‍నార్మల్‍ బై ది స్ట్రోక్స్, ఉత్తమ ర్యాప్‍ సాంగ్‍ : సావేజ్‍ బై మేగాన్‍ తీ స్టాలియన్‍, ఉత్తమ ర్యాప్‍ ఆల్బమ్‍ : కింగ్స్ డీసీజ్‍ బై నాస్‍.

 

Tags :