వచ్చే ఎన్నికల్లో జో బైడెన్ మాకొద్దు

వచ్చే ఎన్నికల్లో జో బైడెన్ మాకొద్దు

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ రాజకీయ ప్రస్తానం ఎంత దారుణంగా ఉందో తాజాగా నిర్వహించిన పోల్స్‌లో వెల్లడైంది. 64 శాతం మంది డెమొక్రాట్లు 2024లో బైడెన్‌ వద్దనుకుంటున్నారు. న్యూయార్క్‌, టైమ్స్‌, సియనా కాలేజీ కలిసి ఈ ఒపీనియన్‌ పోల్స్‌ నిర్వహించాయి. 2024లో అధ్యక్ష అభ్యర్థిగా బైడెన్‌ కన్నా మరెవరినైనా పార్టీ నామినేట్‌ చేస్తే బాగుంటుందని 64 శాతం మంది డెమొక్రాట్‌ ఓటర్లు అభిప్రాయపడ్డారు.  30 ఏళ్లలోపు వారిలో 94 శాతం మంది మరో నేత కోసం ఎదురుచూస్తున్నారు. మొత్తంగా బైడెన్‌ ప్రజాదరణ రేటింగ్‌ 33 శాతానికి పడిపోయింది. కేవలం 13 శాతం మంది మాత్రమే దేశం సరైన దిశలోనే పయనిస్తోందని అభిప్రాయపడుతున్నారు.

 

Tags :