ఏడున్నర లక్షల మంది వదులుకున్నా.. మరో ఆరు లక్షల మంది

ఏడున్నర లక్షల మంది వదులుకున్నా.. మరో ఆరు లక్షల మంది

గడిచిన ఏడు సంవత్సరాల్లో 7.6 లక్షల మంది భారత పౌరసత్వాన్ని వదులుకున్నారనీ, అదే కాలంలో మరో లక్షల మంది భారత పౌరసత్వాన్ని పొందారని ప్రభుత్వం రాజ్యసభకు తెలియజేసింది. పౌరసత్వం వదులుకున్న వారు కనీసం 106 దేశాల్లో స్థిరపడటానికి నిర్ణయించుకోవడం కారణమని, వారంతా వ్యక్తిగత కారణావల్ల పౌరసత్వాన్ని వీడారని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ రాజ్యసభకు తెలిజయేసింది. 2016-21 సంవత్సరాల మధ్య 7,49,645 మంది భారత పౌరసత్వాన్ని వదులుకున్నట్టు కేంద్ర హోం శాఖ వివరించింది.  2019లో 1.44 లక్షల మంది పౌరసత్వాన్ని వదులుకోగా 2016లో 1.41 లక్షల మంది  మాత్రమే పౌరసత్వాన్ని వదులుకున్నారనీ, దీనిని బట్టి పౌరసత్వాన్ని వదులుకుంటున్న వారి సంఖ్య క్రమంగా తగ్గుతోందని కేంద్రం పేర్కొంది.

 

Tags :