నకిలీ పత్రాల కలకలం.. భారతీయ విద్యార్థులకు బహిష్కరణ గండం

నకిలీ పత్రాల కారణంగా కెనడాలో సుమారు 700 మంది భారతీయ విద్యార్థులు ఇబ్బందుల్లో పడ్డారు. విద్యా సంస్థలో ప్రవేశాల కోసం వారు ఇచ్చిన పత్రాల్లో కొన్ని నకిలీవి ఉన్నట్టు అక్కడి అధికారులు గుర్తించారు. దీంతో ఆ విద్యార్థులకు కెనడియన్ బార్డర్ సెక్యూరిటీ ఏజెన్సీ (సీబీఎస్‌ఏ) నుంచి డిపార్టేషన్ లెటర్లు అందినట్లు సమాచారం. తద్వారా వారు కెనడా నుంచి బహిష్కరణ గండాన్ని ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. వీరిలో పంజాబ్‌లోని జలంధర్ నుంచి వెళ్లిన వాళ్లే ఉన్నట్లు తెలుస్తోంది.
Tags :