అందాల పోటీలో విజేతగా 86 ఏళ్ల బామ్మ

అందాల పోటీలో విజేతగా 86 ఏళ్ల బామ్మ

ఇజ్రాయెల్‌ నిర్వహించిన అందాల పోటీలో 86 ఏళ్ల బామ్మ కుకా పాల్మోన్‌ విజేతగా నిలిచి మిస్‌ హోలోకాస్ట్‌ సర్వైవర్‌ కిరీటాన్ని గెలుపొందారు.  ఈ మేరకు జెరూసలేంలోని ఒక మ్యూజియంలో ఈ పోటీలు నిర్వహించారు. అయితే ఈ పోటీల్లో సుమారు 10 మంది 79 నుంచి 90 సంవత్సరాల వయసు ఉన్న బామ్మలు మంచి హెయిర్‌ స్టైల్‌, మేకప్‌ వేసుకొని గౌనులాంటి చీరలను ధరించి క్యాట్‌వ్యాక్‌తో సందడి చేశారు. ఈ సందర్భంగా కుకా పాల్మోన్‌ మాట్లాడుతూ హోలోకాస్ట్‌లో గడిచిన తర్వాత నేను నా కుటుంబ సభ్యులతో కలిసి జీవిస్తున్నాను. నాకు ఇద్దరు పిల్లలు, నలుగురు మనవరాళ్ళు, ఇద్దరు ముని మనవరాళ్లు ఉన్నారు. పైగా నేను ఇక్కడకు వచ్చి  పాల్గొంటానని కలలో కూడా అనుకోలేరు అన్నారు. ఈ  వయసులో విజేతగా నిలిచి ఈ కిరిటాన్ని గెలుచుకోవడం అద్భుతమైన విషయం వర్ణించలేనిది అని అన్నారు.

Tags :