8వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు- రెండవ వీడియో ప్రకటన-ఆహ్వానం

8వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు- రెండవ వీడియో ప్రకటన-ఆహ్వానం

వచ్చే నెల సెప్టెంబర్ 17-18, 2022 తేదీలలో న్యూజీలాండ్ వేదికగా జరగనున్న 8వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు భాషా, సాహిత్యాభిమానులకి సాదర ఆహ్వానం.  

అటు ఆక్లండ్ మహానగరం (న్యూజీలాండ్) లో సభా ప్రాంగణంలో వైభవంగానూ, ఇటు అంతర్జాలం లో ఆత్మీయంగానూ 24 గంటలకి పైగా నిర్విరామంగా జరిగే ఈ 8వ సాహితీ సదస్సులో సుమారు 50 దేశాల సాహితీవేత్తలు పాల్గొంటున్నారు. ఆయా విశేషాలు విశదీకరించే రెండవ వీడియో ప్రకటన వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారి You Tube Chanel లో ఈ క్రింద లింక్ లో చూడండి. గత కొద్ది రోజుల క్రితం ఈ సదస్సు గురించి మేము విడుదల చేసిన మొదటి వీడియో యూట్యూబ్ లో  వీక్షించి స్పందించి ప్రోత్సహించిన సుమారు 13 వేల మంది సాహిత్యాభిమానులకు వేనవేల ధన్యవాదాలు. 

 Link of our Video Invitation -2 

మా ఆహ్వానాన్ని మన్నించి అనేక దేశాల నుండి ఇప్పటి దాకా స్పందించిన వక్తలు అందరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలియ చేసుకుంటున్నాం. ఆహ్వానిత సినీరంగ సాహితీవేత్తలు, సాహితీ రంగంలో నిష్ణాతులు న్యూజీలాండ్ లో వ్యక్తిగతంగా పాల్గొంటున్నారు.

అందరి సౌకర్యార్ధం ప్రసంగ వ్యాసాలు, తదితర వివరాలు మాకు అందవలసిన ఆఖరి తేదీ ఆగస్ట్ 15, 2022 (భారత దేశం అమృతోత్సవ దినం) కి పొడిగించబడింది. ప్రసంగ వ్యాసంఇతర వివరాలు పంపించవలసిన నమోదు పత్రం లింక్ (Please copy & paste the link).

https://tinyurl.com/8va-prapanca-sadassu

ఈ సదస్సులో పాల్గొనే దేశ విదేశాల ప్రతినిధులకు, అంతర్జాలంలో వీక్షించ దల్చుకున్న సాహిత్యాభిలాషులకీ కావలసిన వివరాలతో కూడిన మూడవ సమగ్ర ప్రకటన మరి కొద్ది రోజుల్లో వెలువడుతుంది. ఐదు ఖండాల తెలుగు సాహితీవేత్తలు పాల్గొనే ఈ 8వ ప్రపంచ సాహితీ తెలుగు సదస్సు  గత 7వ ప్రపంచ సదస్సులో (2020) సాధించిన వీక్షకుల రికార్డు  (సుమారు 30 వేల మంది) ని అధిగమిస్తుంది అని అందరి నమ్మకం.

 

8వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు కార్యనిర్వాహక వర్గం

వంగూరి చిట్టెన్ రాజు (vangurifoundation@gmail.com; WhatsApp: 1 832 594 9054)
శ్రీలత మగతల (న్యూజీలాండ్) (+64 210 275 0346):  

శాయి రాచకొండ (హ్యూస్టన్, టెక్సాస్), రావు కొంచాడ (ఆస్ట్రేలియా),  రత్నకుమార్ కవుటూరు (సింగపూర్), డా. వెంకట ప్రతాప్ (మలేషియా), రాపోలు సీతారామరాజు (జోహానెస్ బర్గ్), రాధిక మంగిపూడి (భారత దేశం, సింగపూర్): వంశీ రామరాజు (భారత దేశం), వెంకట్ తరిగోపుల (ఆస్లో, నార్వే), లక్ష్మి రాయవరపు:(టొరంటో, కెనడా), రాధాకృష్ణ గణేశ్న (సింగపూర్) మధు చెరుకూరి (ఆర్లాండో, ఫ్లోరిడా)

 

Tags :