94వ ఆస్కార్ అవార్డుల వేడుకకు తేదీ ఖరారు

94వ ఆస్కార్ అవార్డుల వేడుకకు తేదీ ఖరారు

94వ ఆస్కార్‍ అవార్డుల వేడుకకు తేదీ ఖరారైంది. వచ్చే ఏడాది మార్చి 27న లాస్‍ ఏంజెల్స్ లోని డాల్బీ థియేటర్‍లో ఈ వేడుకను నిర్వహించనున్నట్లు ఆస్కార్‍ నిర్వాహకులు వెల్లడించారు. ఆస్కార్‍కు షార్ట్ లిస్ట్ చేయబడిన చిత్రాలకు ఈ ఏడాది డిసెంబరు 21న, ఆస్కార్‍ నామినేషన్స్ ప్రకటనను వచ్చే ఏడాది ఫిబ్రవరి 8న, ఆస్కార్‍ అవార్డుల ప్రదానోత్సవాన్ని వచ్చే ఏడాది మార్చి 27న జరపనున్నట్లు ఆస్కార్‍ నిర్వాహకులు వెల్లడించారు.

ఉత్తమ చిత్రం విభాగానికి ప్రతిసారీ ఐదు నుంచి పది మధ్యలో సినిమాలను నామినేట్‍ చేసేవారు. కానీ ఇకపై ఉత్తమ చిత్రం విభాగానికి పది సినిమాలను నామినేట్‍ చేయనున్నారు. సాధారణంగా ఆస్కార్‍ వేడుకలు ఫిబ్రవరిలో జరుగుతాయి. కోవిడ్‍ కారణంగా 2021 ఫిబ్రవరిలో జరగాల్సిన 93వ ఆస్కార్‍  అవార్డుల వేడుక ఏప్రిల్‍లో జరిగింది. ఇంకా వచ్చే ఏడాది బీజింగ్‍లో జరగనున్న వింటర్‍ ఒలింపిక్స్ (ఫిబ్రవరి 4-20), లాస్‍ ఏంజెల్స్లో ప్లాన్‍ చేసిన ఓ ప్రముఖ ఫుల్‍బాల్‍ లీగ్‍ల కారణంగా ఆస్కార్‍ అవార్డుల ప్రదానోత్సవానికి 2022 మార్చి 27వ తేదిని ఆస్కార్‍ ప్రతినిధులు ఎంచుకున్నట్లు తెలుస్తోంది.

 

Tags :