అంగరంగ వైభవంగా సత్యసాయి జయంతి వేడుకలు

అంగరంగ వైభవంగా  సత్యసాయి జయంతి వేడుకలు

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో సత్యసాయి బాబా 96వ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. జయంతి వేడుకల్లో పాల్గొనడానికి అత్యధిక సంఖ్యలో సాయి భక్తులు పుట్టపర్తికి విచ్చేసారు. సత్య సాయి బాబా 96వ జయంతి  వేడుకలు సందర్భంగా ప్రశాంతి నిలయంలో బాబా మహా సమాధి దర్శనానికి వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులతో పుట్టపర్తి కిట కిటలాడిరది. ఉదయం 8 గంటలకు పండితుల వేద పఠనంతో వేడుకలు ప్రారంభమయ్యాయి. 8:30 గంటలకు ప్రశాంతి భజన బృందం ఆధ్వర్యంలో గురువందన కార్యక్రమంలో భాగంగా సత్యసాయి విద్యార్థులు బాబా భక్తి గీతాలు ఆలపించారు. విద్యార్థులు నిర్వహించిన సంగీత కార్యాక్రమాన్ని తిలకించిన భక్తులు మైమరిచిపోయారు. అనంతరం సత్యసాయి సెంట్రల్‌ ట్రస్టు వార్షిక నివేదికను ట్రస్ట్‌ సభ్యులుగా నాగానంద చదివి వినిపించారు. అనంతరం సత్యసాయి ట్రస్ట్‌ చేస్తున్న సేవలు, పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి ఆయన ప్రసంగించారు.

గత రెండేళ్లుగా కరోనా కారణంగా నిర్వహించనీ జయంతి వేడుకలు ఏడాది నిర్వహించడంతో ట్రస్ట్‌ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పెద్ద సంఖ్యలో తరలివచ్చే భక్తులకు ఎటువంంటి లోటుపాట్లు రాకుండా మహా సమాధి దర్శనం కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. కరోనా నియమ నిబంధనలు పాటిస్తూనే భక్త జనం సత్యసాయి మహా సమాధిని దర్శించుకునేలా అన్ని ఏర్పాట్లు చేశారు. పెద్ద ఎత్తున తరలి వచ్చిన భక్తులు సాయి కుల్వంత్‌ సభా మందిరంలో బాబా మహా సమాధిని దర్శించుకున్నారు.

 

Tags :