అగ్రరాజ్యంలో 44 లక్షల మంది ఉద్యోగులు రాజీనామా!

అగ్రరాజ్యంలో 44 లక్షల మంది ఉద్యోగులు రాజీనామా!

అగ్రరాజ్యం అమెరికాలో ఉద్యోగాలను వదులుకుంటున్నవారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఆగస్టులో 43 లక్షల మంది తమ ఉద్యోగాలను విడిచిపెట్టగా, సెప్టెంబర్‌లో ఈ సంఖ్య 44 లక్షలుగా నమోదైంది. సెప్టెంబర్‌ 44 లక్షల మంది ఉద్యోగాలకు రాజీనామా చేశారని అమెరికా కార్మిక శాఖ తెలిపింది. దేశంలో మొత్తం శ్రామిక వర్గంలో ఇది 3 శాతం కావడం గమనార్హం. కొత్త అవకాశాల కోసమే పెద్ద సంఖ్యలో కార్మికులు ప్రస్తుత ఉద్యోగాన్ని వదిలేస్తున్నారు. అధిక వేతనం లభించే మార్గాల వైపు దృష్టి సారిస్తున్నట్టు తెలుస్తోంది.

భారీగా ఉద్యోగాలు వదులుకుంటున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఖాళీల సంఖ్య రికార్డు స్థాయిలో పెరుగుతోంది. ప్రస్తుతం అమెరికాలో మొత్తంగా 1.4 కోట్ల ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి. శీతాకాల సెలవులు, క్రిస్మస్‌ సీజన్‌ ఉన్న నేపథ్యంలో అనేక సంస్థలు అదనంగా ఉద్యోగాలను నియమించుకుంటున్నాయి. రిటైలర్లకు, డెలివరీ కంపెనీలకు పెద్ద సంఖ్యలో ఉద్యోగులు అవసరమవుతున్నప్పటికీ వారికి ఉద్యోగార్థులు లభించడం లేదు.

 

Tags :