భారతీయ అమెరికన్ విద్యార్థిపై దాడి

భారతీయ అమెరికన్ విద్యార్థిపై దాడి

అమెరికాలోని టెక్సాస్‌లో భారతీయ అమెరికన్‌ విద్యార్థిని వేధింపులకు గురి చేస్తున్న వీడియో సోషల్‌ మీడియాలో ఆగ్రహానికి, విమర్శలకు దారితీసింది. ఈ సంఘటనను అక్కడే ఉన్న మరో విద్యార్థి వీడియో తీసి ఆన్‌లైన్‌లో షేర్‌ చేయడంతో వైరల్‌ అయింది. ఈ వీడియో ప్రకారం ఒక బెంచీపై కూర్చున్న భారతీయ అమెరికన్‌ అబ్బాయి దగ్గరకు అమెరికన్‌ విద్యార్థి వచ్చి లేని నిలబడమని అగినట్టు వుంది. కూర్చున్న విద్యార్థి లేవడానికి నిరాకరించడంతో అమెరికన్‌ విద్యార్థి కోపంగా అతని మెడచుట్టూ మోచేతికి బిగించి, మెడను నొక్కి ఊపిరి ఆడకుండా చేసి, తలను వెనక్కు వంచాడు. ఈ సంఘటన టెక్సాస్‌లో కొప్పెల్‌ మిడిల్‌ స్కూల్‌లో జరిగింది.

 

Tags :