ఈ దాడికి డొనాల్డ్ ట్రంప్‌దే బాధ్యత ..

ఈ దాడికి డొనాల్డ్  ట్రంప్‌దే బాధ్యత ..

అమెరికా క్యాపిటల్‌ హిల్స్‌ భవనంపై దాడి జరిగి ఏడాది కావస్తోంది. దేశంలో ప్రజాస్వామ్య పరిస్థితులపై అమెరికన్ లలో తీవ్ర ఆందోళన చెందుతున్నట్టు తాజాగా నిర్వహించిన ఒక సర్వేలో వెల్లడైంది. దేశంలో రాజకీయంగా హింసాత్మక వాతావరణం ఏర్పడటంతో ట్రంప్‌ మద్దతుదారులు నేతృత్వంలో క్యాపిటల్‌ భవనంపై గతేడాది జనవరి 6న దాడి జరిగిన సంగతి తెలిసిందే. ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగే హింసాత్మక ఘటనలను సమర్థించవచ్చని మూడో వంతు మంది పేర్కొన్నట్లు మరో సర్వేలో తేలింది. అమెరికా ప్రజాస్వామ్యానికి ముప్పు కొనసాగుతోందని మూడిరట రెండొంతుల మంది అభిప్రాయపడినట్లు తేలింది. ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసేందుకు కొన్ని శక్తులను వినియోగించవ్చని 28 శాతం మంది పేర్కొనగా, ప్రభుత్వంపై హింస్మాతక చర్యలు కొన్ని సార్లు సమర్థించవచ్చని 38 శాతం మంది పేర్కొనట్లు తెలిసింది. ట్రంప్‌ మద్దతుదారులో మూడిరటరెండొంతుల మంది బైడెన్‌ చట్టబద్దంగా ఎన్నుకొబడిన అధ్యక్షుడు కాదన్న ఆరోపణలను విశ్వసిస్తున్నారు. దాడికి  ట్రంప్‌దే బాధ్యత అని సుమారు 60 శాతం మంది వాదిస్తున్నట్లు తెలిసింది.

 

Tags :