ఆధార్ కార్డుదారులంతా.. ప్రతి పదేండ్లకోసారి

ఆధార్ కార్డుదారులంతా.. ప్రతి పదేండ్లకోసారి

ఆధార్‌ కార్డుదారులంతా ప్రతి పదేండ్లకోసారి తమ బయోమెట్రిక్‌ డాటా, ఇతర వివరాలను అప్‌డేట్‌ చేసుకోవాలని యూనిక్‌ ఐడెంటిఫికేషన్‌ అధారిటీ ఆఫ్‌ ఇండియా (యూఐడీఏఐ) సూచించింది. ప్రస్తుతం 5 నుంచి 15 ఏండ్లవారు తప్పని సరిగా ఆధార్‌ వివరాలను ఆప్‌డేట్‌ చేసుకోవాల్సి ఉన్నది. ఇకపై వయోజనులు కూడా ప్రతి పదేండ్లకోసారి స్వచ్ఛందంగా ఆధార్‌ వివరాలను ఆప్‌డేట్‌ చేసుకోవాలని యూఐడీఏఐ తెలిపింది. 70 ఏండ్ల వయసు దాటిన వృద్ధులు మాత్రం ఆధార్‌ను అప్‌డేట్‌ చేసుకోనక్కర్లేలేదని స్పష్టం చేసింది. మేఘాలయ, నాగాలాండ్‌, లడఖ్‌ మినహా దేశంలోని అన్ని ప్రాంతాల్లో వయోజనులను ఆధార్‌లో చేర్చినట్టు యూఐడీఏఐ వెల్లడిరచింది. ప్రస్తుతం దేశంలో 93.65 శాతం మందికి ఆధార్‌ కార్డులు ఉన్నాయని పేర్కొన్నది.

 

Tags :