అమెరికాలో ఆపి 40వ వార్షిక సదస్సు

అమెరికాలో ఆపి 40వ వార్షిక సదస్సు

అమెరికన్‌ అసోసియేసన్‌ ఆఫ్‌ ఫిజీషియన్స్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఆరిజన్‌ (ఆపి) 40వ వార్షిక సదస్సు టెక్సాస్‌ రాష్ట్రంలోని శాన్‌ ఆంటోనియో నగరంలో ఈ నెల 23 నుంచి 26 వరకు నిర్వహిస్తున్నామని అధ్యక్షురాలు డాక్టర్‌ జి.అనుపమ తెలిపారు.  సదస్సులో పలు అంశాలపై చర్చిస్తామన్నారు. ఆపి సంస్థకు భారతదేశంలో అత్యున్నత సేవలు అందిస్తున్న ప్రముఖ వైద్య నిపుణుడు, ఆపి ఓవర్సీస్‌  కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ దువ్వూరు ద్వారకానాథరెడ్డికి ప్రత్యేక సేవా అవార్డు అందజేస్తామని తెలిపారు.

 

Tags :