లైఫ్‌స్టైల్ మెడిసిన్ తో రోగాలకు చెక్

లైఫ్‌స్టైల్ మెడిసిన్ తో రోగాలకు చెక్

జీవన విధానంలో చేసుకునే చిన్న చిన్న మార్పుల ద్వారా ఎన్నో రోగాలకు చెక్ పెట్టొచ్చని అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇడియన్ ఆరిజిన్ (ఏఏపీఐ-ఆపి) వైద్యులు స్పష్టం చేశారు. ఈ మేరకు లైఫ్‌స్టైల్ మెడిసిన్ గురించి నిర్వహించిన వెబినార్‌లో ఆపి వైద్యులు పలు విషయాలు చర్చించారు. ఈ లైఫ్‌స్టైల్ మెడిసిన్ అనేది చాలా సింపుల్ అని, అదే సమయంలో అత్యంత శక్తిమంతమైన వైద్యం అని ఆపి ప్రెసిడెంట్ డాక్టర్ రవి కొల్లి అన్నారు. ఆరోగ్యం, వ్యాధుల నివారణపై అవగాహన కల్పించేందుకు చాలా కృషి చేసిన డాక్టర్ కౌషిక్ రెడ్డిని ఈ కార్యక్రమంలో ఆపి సీఎంఈ చైర్ డాక్టర్ శ్రీని గంగసాని పలువురు వైద్యులకు పరిచయం చేశారు. ఈ కార్యక్రమంలో సుమారు 200 మందికిపైగా వైద్యులు పాల్గొన్నారు. ఈ వెబినార్‌లో లైఫ్‌స్టైల్ మెడిసిన్ గురించి పలు విభాగాల్లో బోర్డు సర్టిఫైడ్ అయిన ప్రముఖ వైద్యులు డాక్టర్ పరమ్ దేదియా ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఈ సందర్భంగా మాట్లాడిన డాక్టర్ కౌషిక్ ఆర్. రెడ్డి.. ఇలా జీవన విధానంలో మార్పుల ద్వారా పేషెంట్లకు ఆరోగ్యం అందించడానికే తాను ప్రాధాన్యం ఇస్తానని చెప్పారు. అందుకే తన పేషెంట్లతో ‘నా దగ్గర క్యారెట్, స్టెంట్ ఉన్నాయి. ఏది కావాలో తేల్చుకోండి’ అంటారట. మన జీవితం ఎంత నాణ్యంగా ఉంటే అంత ఎక్కువగా ఉంటుందనేది కాదనలేని సత్యం. ఇదే విషయాన్ని వెబినార్‌లో వైద్యులు చెప్పారు. ఈ సందర్భంగా వెబినార్‌లో మాట్లాడిన ప్రముఖ వైద్యులకు, ఆపి సభ్యులకు కైజర్ పర్మనెంటేలో లైఫ్‌స్టైల్ మెడిసిన్ విభాగం డైరెక్టర్‌గా ఉన్న డాక్టర్ పంకజ్ వు ధన్యవాదాలు తెలిపారు. ఈ వైద్య విధానాలు ఎంతో విలువైనప్పటికీ అంత ప్రచారం లభించలేదని, యూఎస్ వైద్య విద్యా విధానంలో సమూల మార్పులు అవసరమని ఆపి వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ సతీష్ కత్తుల పేర్కొన్నారు.

 

 

Tags :