నోబెల్ బహుమతి అందుకున్న అబ్దుల్ రజాక్ గుర్నా

నోబెల్ బహుమతి అందుకున్న అబ్దుల్ రజాక్ గుర్నా

సాహిత్యంలో ఈ ఏడాదికి గాను టాంజేనియా నవలా రచయిత అబ్దుల్‌ రజాక్‌ గుర్నాను నోబెల్‌ బహుబతి వరించింది. వలసవాదంపై ఆయన రాజీలేని పోరాటంతో పాటు, శరణార్థుల వ్యథను కళ్లకు కట్టినందుకుగానూ రజాక్‌కు ఈ పురస్కారాన్ని అందిస్తున్నట్లు రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ వెల్లడిరచింది. అబ్దుల్‌ రజాక్‌ గుర్నా 1948లో హిందూ మహాసముద్రంలోని జాంజిబర్‌ ద్వీపంలో జన్మించారు. కానీ 1960 చివర్లో శరణార్థిగా ఇంగ్లాండ్‌ వలసవెళ్లారు. ప్రస్తుతం ఆయన కేంట్రబెరీలోని కెంట్‌ యూనివర్శిటీలో సాహిత్య ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఇక 21వ ఏట నుంచే రచనలు ప్రారంభించారు రజాక్‌. ఇప్పటి వరకు 10 నవలలు, ఎన్నో చిన్న కథలు రచించారు. 2005లో రజాక్‌ రాసిన డిసర్షన్‌ నవల అప్పట్లో సంచలనం సృష్టించింది. భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, ఆర్థిక శాస్త్రం, ఫిజియాలజీ లేదా మెడిసిన్‌, సాహిత్యం అంశాల్లో నోబెల్‌ పురస్కారాలను ఈ అకాడమీ అందజేస్తుంది.      

 

Tags :