అమెరికాలోని ఇంటెల్ ఆఫర్.. రూ.2 కోట్ల వేతనంతో కొలువు

అమెరికాలోని ఇంటెల్ ఆఫర్.. రూ.2 కోట్ల వేతనంతో కొలువు

తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురంలోని గౌతమీనగర్‌కు చెందిన అభిరాంరెడ్డి (30) అమెరికాలోని ప్రతిష్ఠాత్మక ఇంటెల్‌ లో రూ.2 కోట్ల వార్షిక వేతనంతో కొలువు సాధించాడు. గౌతమీనగర్‌లోని అణుశక్తి కేంద్ర పాఠశాలలో పదో తరగతి వరకు చదవిన ఈ యువకుడు యూనివర్సిటీ ఆఫ్‌ మెసాచుసెట్స్‌లో పాలిమర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌లో పీహెచ్‌డీ పూర్తి చేశాడు. మెటీరియల్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌లో పోస్ట్‌ డాక్టరేట్‌ పూర్తి చేసి ఈ నెలలో అమెరికాలోని ప్రతిష్ఠాత్మక ఇంటెల్‌ కంపెనీలో రీసెర్చ్‌ సైంటిస్టుగా రూ.2 కోట్ల వార్షిక వేతనంతో ఉద్యోగం దక్కించుకున్నాడు.

 

Tags :