ప్రివిలేజ్ కమిటీ ముందు అచ్చెన్నాయుడు

ప్రివిలేజ్ కమిటీ ముందు అచ్చెన్నాయుడు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అసెంబ్లీ ప్రివిలేజ్‌ కమిటీ సమావేశానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు హాజరయ్యారు. స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ అచ్చెన్నాయుడుకు ప్రివిలేజ్‌ కమిటీ నోటీసులు ఇచ్చింది. ప్రివిలేజ్‌ కమిటీ ముందు హాజరైన అచ్చెన్నాయుడు తన వ్యాఖ్యలు బాధకలిగించి ఉంటే విచారం వ్యక్తం చేస్తున్నానని తెలిపారు. అదే విషయాన్ని కమిటీ ముందు చెప్పానని మీడియా సమావేశంలో తెలిపారు. వ్యక్తిగత కారణాల వల్ల గతంలో కమిటీ ముందుకు రాలేకపోయానన్నారు. స్పీకర్‌పై తాను అనుచిత వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేశారు. ప్రెస్‌నోట్‌లో పేర్కొన్న అంశాలపై ప్రివిలేజ్‌ కమిటీ అభ్యంతరం వ్యక్తం చేసిందని, ఆ ప్రెస్‌ నోట్‌పై తన సంతకం కూడా లేదన్నారు. అయినా ఎలాంటి బేషజాలు లేకుండా విచారణ వ్యక్తం చేశానని చెప్పానన్నారు. కమిటీ తన వివరణతో సంతృప్తి చెందినట్లు భావిస్తున్నానని అచ్చెన్నాయుడు అభిప్రాయం వ్యక్తం చేశారు.

 

Tags :