ఏపీకి పూర్వస్థితి రావాలంటే..టీడీపీ అధికారంలోకి

ఏపీకి పూర్వస్థితి రావాలంటే..టీడీపీ అధికారంలోకి

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పూర్వస్థితి రావాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. ఒంగోలులో ఆయన మీడియాతో మాట్లాడుతూ గ్రామాల్లో వైసీపీ నాయకులను ప్రజలు అసహ్యించుకుంటున్నారని అన్నారు. ప్రభుత్వం ఏం చేసింది? అని ప్రజలు వైసీపీ నేతలను నిలదీస్తున్నారని ఆక్షేపించారు. వారికి నాయకులు సరైన సమాధానం చెప్పలేకపోతున్నారని విమర్శించారు. మహానాడు వేదిక ఏర్పాటు చేసుకుంటే తిరస్కరిస్తారా అని నిలదీశారు. మినీ స్టేడియం ఇవ్వకపోతే మండువారిపాలెంలో స్థలం ఎంపిక చేసినట్లు తెలిపారు. సమాజహితం కోసం పని చేస్తున్న పార్టీ తెలుగుదేశమని అన్నారు.

 

Tags :