MKOne Telugu Times Business Excellence Awards

2024లో అధికారం మాదే

2024లో అధికారం మాదే

2024లో జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని  టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కనీవినీ ఎరుగని రీతిలో రాజమండ్రిలో మహానాడుకు నిర్వహిస్తామన్నారు. మహానాడులో వచ్చే ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రధానాంశాలు చంద్రబాబు ప్రకటిస్తారని తెలిపారు. విజయ దశమికి సమగ్రమైన, రాష్ట్ర భవిష్యత్తును మార్చే దిశగా మ్యానిఫెస్టో విడుదల చేస్తామన్నారు.  26వ తేదీన టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు రాజమండ్రి చేరుకుంటారని, 26 సాయంత్రం పొలిట్‌ బ్యూరో సమావేశం చంద్రబాబు అధ్యక్షతన జరగనుందని వివరించారు. ఈ సమావేశంలో మహానాడులో ప్రవేశపెట్టే 15 తీర్మానాలు చర్చించి ఆమోదిస్తామన్నారు. 27న 15 వేల మంది ప్రతినిధుల  సభలో చంద్రబాబు పాల్గొంటారని తెలిపారు. 28న మహానాడుకు శరవేగంగా ఏర్పాట్లు కొనసాగుతున్నాయని, మహానాడు నుంచే ఎన్నికల శంఖారావం ఆరంభమవుతుందన్నారు. వచ్చే ఎన్నికలల్లో తెలుగుదేశం అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 

 

 

Tags :