మైసూర్‌లోని హోటల్లో నరేష్, పవిత్రా లోకేష్ : పవిత్ర ను చెప్పుతో కొట్టబోయిన మూడో భార్య రమ్య రఘుపతి

సీనియర్ నటుడు నరేష్ పర్సనల్ లైఫ్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నరేష్, అతని మూడో భార్య రమ్య రఘుపతి, పవిత్రా లోకేష్‌ల మధ్య వ్యవహారం వేడెక్కిపోతోంది. తాజాగా తన మూడో భార్య రమ్య రఘుపతి మీద మరో ఆరోపణ చేశాడు. రమేష్ శెట్టి అనే వ్యక్తితో సంబంధం ఉందని ఆరోపించాడు. .వీరి గొడవ ఇప్పుడు మీడియాలోకి రావటంతో వివాదం ముదిరింది. ఆదివారం రోజున రమ్య రఘుపతి మైసూర్‌లోని హోటల్లో ఉన్న సీనియర్ నరేష్, పవిత్రా లోకేష్ దగ్గరకు వెళ్లి గొడవ చేసింది. నరేష్, పవిత్రా లోకేష్‌లు హోటల్లో ఉంటే అక్కడికి సైతం రమ్య రఘుపతి వెళ్లారు. అక్కడే హంగామా చేయడంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. నరేష్, పవిత్రా లోకేషన్లను అక్కడి నుంచి పంపించేశారు.
అయితే ఈ సందర్బంగా రమ్య రఘుపతి కూడా అదుపు తప్పేశారు. పవిత్రా లోకేష్‌ను చెప్పుతో కొట్టేందుకు రెడీ ఉన్నారు. కానీ పోలీసులు ఆమెను పక్కకు తీసుకుపోయారు. అయితే రమ్య వెంట వచ్చిన వారు.. నరేష్ డౌన్ డౌన్, పవిత్రా డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. వారంతా అలా అరుస్తుంటే.. నరేష్ మాత్రం తెగ ఎంజాయ్ చేస్తూ, చేతులు ఊపుకుంటూ, విజిల్స్ వేస్తూ వెళ్లిపోయాడు. ఇక ఆమె ఒక మోసగత్తె.. మోసగత్తె అంటూ నరేష్ అరిచేశాడు. ఇక ఇంకొంచెం ముందుకు వెళ్లిన నరేష్ ఆమె మీద ఇంకో ఆరోపణ చేశాడు. ఇధి వరకే తన భార్యకు, డ్రైవర్‌కు సంబంధం ఉందని చెప్పిన నరేష్..మళ్లీ ఇంకో కొత్త రిలేషన్‌ను అంటగట్టాడు. రమేష్ శెట్టి అనే కొత్త పేరును వెలుగులోకి తీసుకొచ్చాడు. రమ్యకు, రమేష్ శెట్టి మధ్య సంబంధం ఉందని, వారిద్దరూ లవర్స్ అని, ఇద్దరూ కలిసి తనను మోసం చేయాలని, బ్లాక్ మెయిల్ చేయాలని ప్రయత్నించినట్టు నరేష్ చెప్పుకొచ్చాడు. అయితే ఓ వ్యక్తి మాత్రం వారిద్దరూ బ్రదర్ అండ్ సిస్టర్ అని చెబుతున్నారంటూ తెలిపాడు. మొత్తానికి నరేష్ పవిత్రా లోకేష్ రమ్య రఘుపతి పేర్లు మాత్రం కన్నడ, తెలుగు రాష్ట్రాల్లో మార్మోగిపోతోన్నాయి. ఈ వ్యవహారం ఎక్కడి వరకు వెళ్లి ఆగుతుందో చూడాలి.
రమ్య రఘుపతి నరేష్‌కు ఎలా పరిచయం.. అనే వివరాల్లోకి వెళితే.. టాలీవుడ్‌కి చెందిన సీనియర్ నటుడు వి.కె.నరేష్..అతని మూడో భార్య రమ్య రఘుపతి మధ్య విబేధాలు ఎక్కువయ్యాయి. ఇన్ని రోజుల వరకు కొందరికి మాత్రమే పరిమితమైన వీరి గొడవ ఇప్పుడు మీడియాలోకి రావటంతో వివాదం ముదిరింది. నరేష్..నటి పవిత్రా లోకేష్ ను పెళ్లి చేసుకోబోతున్నాడంటూ వస్తున్న వార్తలు పక్కన పెడితే, ఇప్పుడు నరేష్ కుటుంబంలో నెలకొన్ని అనిశ్చితి హాట్ టాపిక్‌గా మారింది. ఆదివారం రోజున రమ్య రఘుపతి మైసూర్‌లోని హోటల్లో ఉన్న నరేష్, పవిత్రా లోకేష్ దగ్గరకు వెళ్లి గొడవ చేసింది. పవిత్రపై ఏకంగా చెప్పుతో దాడి కొట్టడానికి ప్రయత్నించింది రమ్య రఘుపతి.
అసలు రమ్య రఘుపతి ఎవరు? ఈమె నరేష్‌కు ఎలా పరిచయం.. అనే వివరాల్లోకి వెళితే.. ఆమె కాంగ్రెస్ మాజీ పీసీసీ చీఫ్ రఘవీరా రెడ్డి, రమ్య రఘుపతి తండ్రి అన్నదమ్ములు. వీరు బెంగుళూరులోనే స్థిరపడ్డారు. రమ్య రఘుపతి అసిస్టెంట్ దర్శకురాలిగా పనిచేస్తున్న క్రమంలో వి.కె.నరేష్‌తో ఏర్పడ్డ పరిచయం పెళ్లికి దారి తీసింది. ఇద్దరూ పెళ్లి కూడా చేసుకున్నారు. ఓ బాబు కూడా ఉన్నాడు. కాగా.. KGF చిత్రంతో పాన్ ఇండియా రేంజ్లో సత్తా చాటిన దర్శకుడు ప్రశాంత్ నీల్ .. రమ్య రఘుపతికి అన్నయ్య అవుతాడు. ఇప్పుడు చెల్లెలు కుటుంబం ఇబ్బందుల్లో ఉంది. ఇన్ని రోజులంటే విషయం పెద్దగా బయటకు పొక్కలేదు కాబట్టి..సైలెంట్‌గా ఉన్న ప్రశాంత్ నీల్ మరిప్పుడు ఏ మేరకు ఈ వ్యవహారంలో కలుగ చేసుకుంటారనేది డిస్కషన్ పాయింట్‌గా మారింది. మరి సోషల్ మీడియాలో వస్తున్న ఈ వార్తలపై ప్రశాంత్ నీల్ ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి మరి.