పార్లమెంటులో తెలుగు ఎంపీలకు ఒక చరిత్ర.... కానీ ఇప్పుడు

పార్లమెంట్‌లో తెలుగు ఎంపీలకు ఒక మంచి చరిత్ర ఉంది, ఇప్పుడు గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారంతో అంతా తుడిచిపెట్టుకు పోయిందని సినీ నటుడు పృథ్వీరాజ్ అన్నారు. హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారంపై ఆయన స్పందించారు. అంగబలం, అర్ధబలం ఉండటంతోనే గోరంగ్ల మాధవ్‌ను వెనకేసుకొస్తున్నారని విమర్శించారు. ఈ నెల 4న బయటపడిన ఆ దరిద్రపు వీడియోకి సంబంధించి ఎంపీ మాధవ్ వాడిన భాష ఆ పార్టీ నేతలకు బాగా నచ్చినట్టుందన్నారు. ఇంత దౌర్భాగ్యం ఎప్పుడూ చూసి ఉండం. పృథ్వీ వ్యవహారంలో వారంపాటు ఖాళీలేకుండా ప్రెస్‌మీట్‌లు పెట్టిన ఆ పార్టీ నేతలు ఇప్పుడేమయ్యారు. అనంతపురం ఎస్సీ చెబుతున్న విషయాలు ఒకదానికొకటి పొంతన లేవు. చివరకు ఫేక్ అని తేల్చేశారు. కానీ ప్రజలు ఆ మాత్రం అవగతం చేసుకోకుండా ఉండరు అని అన్నారు.
Tags :