చంద్రబాబుతో సినీ నటుడు రాజ్ కుమార్ భేటీ

చంద్రబాబుతో సినీ నటుడు రాజ్ కుమార్ భేటీ

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుని తెలుగు సినీ నటుడు రాజ్‌ కుమార్‌ కలిశారు. మంగళగిరిలో పార్టీ  కేంద్ర కార్యాలయానికి వచ్చిన రాజ్‌ కుమార్‌ చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వీరిద్దరూ కాసేపు మాట్లాడుకున్నారు. అనంతరం రాజ్‌ కుమార్‌ మీడియాతో మాట్లాడుతూ 2024 ఎన్నికల్లో టీడీపీదే విజయమని తెలిపారు. 1996 నుంచి తాను టీడీపీ కోసం ప్రచారం చేస్తున్నారని ఆయన వెల్లడిరచారు. త్వరలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో చంద్రబాబుతో భేటీ అయ్యానన్నారు. టీడీపీ అభిమానిగా చంద్రబాబును మర్యాదపూర్వకంగానే తాను కలిసినట్టు ఆయన వెల్లడించారు.

 

Tags :